జాతీయ వార్తలు

నేడు మోదీ గుజరాత్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఒక రోజు పర్యటన కోసం గుజరాత్ వస్తారని శ్రీ సోమ్‌నాథ్ ట్రస్టు కార్యదర్శి పీకే లాహిరి బుధవారం పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. నాలుగు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని అన్నారు. గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొంటారని, ఆతర్వాత గాంధీనగర్‌లోని శ్రీ సోమ్‌నాథ్ ట్రస్టు కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారని వివరించారు. ఈ ట్రస్టులో మోదీ కూడా సభ్యుడని, ఆ హోదాలోనే ఆయన సమావేశానికి వస్తారని తెలిపారు. కాగా, గురువారం ఉదయం గుజరాత్ చేరుకోనున్న ప్రధాని వల్సాద్ పట్టణ సమీపంలోని జుజ్వా గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్ల ఈ-గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్రం స్పాన్సర్ చేస్తున్న ఈ పథకం కింద గుజరాత్‌లో ఇప్పటికి లక్షకు పైగా ఇళ్ల నిర్మాణం జరిగింది. కాగా, అదే కార్యక్రమంలో ఆయన ధరంపూర్, కప్రాదా తాలూకాలకు నీటిని అందించే ప్రాజెక్టుకు భూమిపూజ చేస్తారు. అనంతరం సౌరాష్టల్రోని జునాగఢ్ పట్టణంలో కొత్తగా నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించడంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. గిర్ సోమ్‌నాథ్ జిల్లా, వెరావల్ పట్టణంలో రెండు ఫిషరీస్ కాలేజీలను ప్రారంభిస్తారు. ఆతర్వాత ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ కాన్వొకేషన్‌కు వెళతారు. అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఢిల్లీకి బయలుదేరి వెళతారు.