జాతీయ వార్తలు

బీజేపీ వౌనం వెనుక కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పానాజి, ఆగస్టు 27: రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారంలో వేల కోట్ల కుంభకోణం ఉందని తాము చేసిన ఆరోపణలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వౌనం వహిస్తోందని, తమ ఆరోపణలకు సమాధానం చెప్పడంలో తాత్సారం చేస్తోందని, బీజేపీ వౌనం వెనుక కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ అప్పట్లో రక్షణమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ లేకుండానే ఫ్రాన్స్‌తో 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు 2016లో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పటికైనా పారికర్ తన వౌనాన్ని విడనాడి వాస్తవమేంటో జాతికి వెల్లడించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. మోదీ జాతి ప్రయోజనాల కన్నా తన స్వార్థ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ఆమె ఆరోపించారు. రాఫెల్ విమానాలను వాస్తవ ధరకన్నా ఎక్కువ మొత్తం పెట్టి కొనుగోలు చేస్తున్నారని, అలాగే కావాల్సిన విమానాల సంఖ్యను తగ్గించారని, ఈ ప్రాజెక్టుతో ప్రభుత్వ రంగ సంస్థకు ప్రయోజనం లేకుండా తన మిత్రునికి చెందిన ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాఫెల్ ఒక ఒప్పందం కాదని, ఇది ఒక కుంభకోణమని ఆమె వ్యాఖ్యానించారు. అసలు దీంతో ప్రభుత్వం ఏమి చేస్తోంది, ఏమి చేయాలనుకుంటుంది అని ఆమె ప్రశ్నిస్తూ ఇది జాతికి అవమానకరమని అన్నారు. ఈ విషయంలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వౌనం వహించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆమె పేర్కొంది. ఇంత పెద్దమొత్తంలో ఒప్పందం కుదురినప్పుడు అప్పటి రక్షణ మంత్రి, ఇప్పటి గోవా మంత్రి పారికర్ కనీసం ఫ్రాన్స్‌లో లేరని ఆమె విమర్శించారు. సరే ఈ ఒప్పందం గురించి ప్రధాని ప్రకటించినప్పుడు పారికర్ సిద్ధంగా లేరని అనుకుందాం, కాని ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు, ఇతర ఒడంబడికల గురించి కూడా పారికర్‌కు తెలియదంటే మనం ఏమనుకోవాలని ఆమె ప్రశ్నించారు. 2014 నుంచి 2017 వరకు పారికర్ రక్షణ మంత్రిగా వ్యవహరించారని, ఆయన హయాంలోనే ఇంత పెద్ద ఒప్పందం జరిగిందని, కాబట్టి ఆయన దీనికి సంబంధించి వస్తున్న విమర్శలపై తప్పక సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. పారికర్ ఈ విషయంలో అసలు నోరు విప్పకుండా వౌనం పాటిస్తున్నారని, వౌనంగా ఉండటం కూడా తప్పేనని ఇది జాతిని వంచించడమేనని ఆమె విమర్శించారు.