జాతీయ వార్తలు

సంఘ్ సమ్మేళనంలో రాహుల్‌కు హితబోధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఆర్‌ఎస్‌ఎస్‌పై పదేపదే విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వచ్చేనెలలో జరిగే సంఘ్ సమ్మేళన్‌కు పిలిచి హితబోధ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. రాహుల్‌తోపాటు సీపీఎం నేత సీతారాం ఏచూరిని ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. భిన్నమైన అభిప్రాయాలు, సిద్ధాంతాలతో ఉన్నవారిని ఓ వేదికపైకి పిలవాలని సంస్థ నిర్ణయించింది. ఎవరెవర్ని ఆహ్వానించాలన్నదానిపై ఆర్‌ఎస్‌ఎస్ కసరత్తుచేస్తోంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో వచ్చేనెల 17 నుంచి 19 వరకూ మూడు రోజుల పాటు ఆర్‌ఎస్‌ఎస్ సమ్మేళన్ జరగనుంది. ఈ మూడు రోజుల్లో ఏదో ఓరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘్భరత్ భవిష్యత్- ఆర్‌ఎస్‌ఎస్ విధానం’అన్న అంశంపై ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఉపన్యసిస్తారు. మూడు రోజుల సదస్సులో భాగవత్ వరుసగా ప్రసంగాలు చేస్తారని సంస్థ ప్రచార్ ప్రముఖ్ అరుణ్‌కుమార్ సోమవారం ఇక్కడ వెల్లడించారు. ‘ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్‌జీ సమకాలిన సమస్యలు, జాతీయ ప్రాధాన్యత గల అంశాలపై బోధిస్తారు’అని ఆయన స్పష్టం చేశారు. ఈ సదస్సుకు ఎవరెవర్ని ఆహ్వానించాలన్నదానిపై కసరత్తు జరుగుతోందని కుమార్ పేర్కొన్నారు. జూన్‌లో నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమ్మేళనానికి మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.