జాతీయ వార్తలు

నిబంధనలకు అనుగుణంగానే ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిపించటం గురించి తమతో సంప్రదించలేదని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం లేదా మరెవరైనా శాసనసభను రద్దు చేసి తమ వద్దకు వస్తే ఎన్నికల చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళతామని వారు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయంటూ జరిగే ప్రచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. ఎన్నికలనేవి నియమావళికి అనుగుణంగా జరుగుతాయే తప్ప బయట జరిగే ప్రచారం మేరకు కాదని వారు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి కె.ఎం.సహానీ కొన్ని రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావాసాను కలిసి చర్చలు జరపటం గురించి అడుగ్గా.. ఈ చర్చలకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని వారు దాటవేశారు.

పాక్-్భరత్ ద్వైపాక్షిక చర్చలకు మొదటి అడుగు
* నేడు ఇండస్ జలాల సంధిపై రెండు దేశాల చర్చలు
ఇస్లామాబాద్, ఆగస్టు 27: పాక్ ప్రధానిగా ఇమ్రాన్ పదవీ స్వీకారం చేసిన అనంతరం పాక్-్భరత్ మధ్య మొదటిసారిగా ద్వైపాక్షిక చర్చలకు మొదటి అడుగు పడింది. ఇరుదేశాల మధ్య ముఖ్యమైన అంశాలతో పాటు అతి ముఖ్యమైన ఇండస్ జలాల ఒప్పందంపై లాహోర్‌లో బుధవారం చర్చలు జరగనున్నాయి. భారత్‌కు చెందిన ఇండస్ వాటర్ కమిషనర్ పికె సక్సేనా రెండురోజుల పాటు పాక్‌కు చెందిన సయ్యద్ మెహర్ అలిషాతో చర్చలు జరపడానికి ఇస్లామాబాద్ చేరుకోనున్నట్టు పాక్ అధికార వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు ఇదే అంశంపై ఇరుదేశాల మధ్య మార్చిలో న్యూఢిల్లీలో జరిగాయి. ఆ చర్చల్లో ఇరుదేశాలు 1960లో జరిగిన సంధి ప్రకారం నదీజలాల లభ్యత, వాడుతున్న నీటి పరిమాణం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కాగా, ప్రధానిగా ఇమ్రాన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరుదేశాల మధ్య చర్చలకు మరో అడుగుపడింది. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు నెలకొల్పుకుందామని భారత్ ప్రధాని నరేంద్రమోదీ సైతం ఖాన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ చర్చల్లో పలుఅంశాలు ప్రస్తావనకు రావడమే కాకుండా భవిష్యత్‌లో ఇరుదేశాల మధ్య చేపట్టాల్సిన చర్చలు, పర్మినెంట్ ఇండస్ కమిషన్, బృందాలు చేపట్టాల్సిన సందర్శనలు తదితర అంశాలపై నిర్ణయం జరుగుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఇరుదేశాలకు సంయుక్తంగా ఉన్న నదులపై ఉన్న హైడ్రో ప్రాజెక్టులకు సంబంధించిన డాటాను పంచుకుంటాయి. అంతేకాకుండా భారత్ చేపట్టిన నీటినిల్వ ప్రాజెక్టులు, హైడ్రో పవర్ ప్రాజెక్టులపై పాక్‌కు గల అభ్యంతరాలను ఈ చర్చల్లో తిరిగి ప్రస్తావించనున్నట్టు అధికార వర్గాలు భావిస్తున్నాయి.