జాతీయ వార్తలు

శాంతి భద్రతల పరిరక్షణలో యూపీ మేటి: ఆదిత్యనాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: శాంతి భద్రతల పరిరక్షణలో ఉత్తర ప్రదేశ్ మేటిగా ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్రంలో అడపాదడపా జరిగే హింసాత్మక సంఘటనలను ప్రతిపక్షాలు భూతద్దంలో చూపెడుతుండడంపై ఆయన ధ్వజమెత్తారు. 15 ఏళ్లతో పోల్చుకుంటే ఇపుడు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంతో బేషుగ్గా ఉందని, ఈ విషయాన్ని ఇక్కడే కాకుండా దేశం మొత్తం కూడా అంగీకరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని డియోరియా షెల్టర్ హోంలో జరిగిన సంఘటనపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో కాసేపు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు దురదృష్టకరమని అన్నారు. ఎన్నో సమస్యలపై సభలో చర్చించాల్సి ఉండగా ప్రతిపక్షాలు అనవసర చర్చతో సమయాన్ని వృథా చేశాయని ఆయన విమర్శించారు. డియోరియా బాలికల షెల్టర్ హోం కేసును హైకోర్టు నేతృత్వంలో కింది కోర్టు పర్యవేక్షిస్తోందని ఆయన అన్నారు. మొత్తం 403 సభ్యులున్న అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చించాల్సి ఉండగా, ఇతరుల హక్కులకు భంగం వాటిల్లేవిధంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించడం ప్రజాస్వామ్య మనుగడకు శుభపరిణామం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
డియోరియా షెల్టర్ హోంకు 2009తో అప్పటి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందని, అప్పటినుంచి 2017 వరకు ఆ సంస్థకు నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి డీఎం, ఎస్పీలపై చర్యలు తీసుకున్నామని, సీబీఐ విచారణకు కూడా సిఫార్సు చేశామని ఆయన అన్నారు. ఈ కేసు సీబీఐ స్వీకరించే వరకు త్రిసభ్య కమిటీ సమగ్రంగా విచారిస్తుందని ఆయన పేర్కొన్నారు.