జాతీయ వార్తలు

తక్షణ విచారణకు సుప్రీం కోర్టు ‘నో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై గతంలో ఇచ్చిన తీర్పును తక్షణ పునర్విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు రూలింగ్‌పై సోమవారం వివిధ దళిత సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకరూపం దాల్చి పదిమంది వరకూ మరణించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా ఎస్సీ, ఎస్టీ చట్టం పూర్వస్థితిని కొనసాగించాలని కోరుతూ కేంద్రం సోమవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. గత నెలలో ఇదే చట్టంపై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఫిర్యాదు అందిన వెంటనే నిందితులను అరెస్ట్ చేయనవసరం లేదని ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ప్రాథమిక విచారణ, నేర నిర్థారణ తర్వాతే అరెస్ట్‌లు చేపట్టాలని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. కాంగ్రెస్, ఆర్‌జెడీలతో సహా వివిధ విపక్ష పార్టీలు సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చడం వల్ల దేశంలో దళితులపై దాడులు మరింతగా పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశాయి.