జాతీయ వార్తలు

అస్సాంలో మళ్లీ శాంపిల్ సర్వే జరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్‌లో తమ పేర్లు లేవని చెబుతున్న పది శాతం మంది విషయంలో శాంపిల్ సర్వే, మళ్లీ తనిఖీల కార్యక్రమం చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవలనే జాతీయ పౌర రిజిస్టర్‌కు సంబంధించి ముసాయిదా పౌర రిజిస్టర్‌ను ప్రకటించిన విషయం విదితమే. జస్టిస్ రంజన్ గోగాయ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.ముందుగా శాంపిల్ సర్వే చేపట్టాలని, ఆ తర్వాత పూర్తి స్థాయిలో పేర్లనమోదు, తనిఖీలు చేపట్టాలని కోర్టు పేర్కొంది.
జాతీయ పౌర రిజిస్టర్ ముసాయిదా ప్రతులపై అభ్యంతరాలను తెలియచేసేందుకు చివరి తేదీ ఈ నెల 30వ తేదీ వరకు ఉన్న గడువును పొడిగించినట్లు కోర్టుపేర్కొంది. జాతీయ పౌర రిజిస్టర్ రెండవ ముసాదాను జూలై 30వ తేదీన ప్రకటించారు. ఇందులో 3.29 కోట్ల మందిలో 2.89 కోట్ల మంది పేర్లు ఉన్నాయి. 40.70లక్షల మంది పేర్లు లేవు. 37.59 లక్షల మంది పేర్లను తిరస్కరించారు. 2,48,088 మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జాబితాలో పేర్లు లేని 40 లక్షల మందికి సంబంధించి ఎటువంటి నిర్బంధ చర్యలు ఉండవని కోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే. అభ్యంతరాలు తెలియచేసేందుకు విధి విధానాలను నిర్దేశించాలని సుప్రీంకోర్టు గతంలోనే కేంద్రాన్ని కోరింది. కాగా అస్సాంలో జిల్లాలవారీగా జాతీయ పౌర రిజిస్టర్‌లో పేర్లు ఉన్న వారి జాబితాను తమకు సమర్పించాలని కోర్టు అస్సాం ఎన్‌ఆర్‌సీ కోఆర్డినేటర్‌ను ఆదేశించింది. ఎన్‌ఆర్‌సీ తుది జాబితా ప్రకటించిన తర్వాత అందులో ఇంతవరకు ఆధార్ కార్డు లేని వారికి కార్డు ఇస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది.