జాతీయ వార్తలు

సింధూ జలాలపై మొదలైన పాక్-భరత్ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఆగస్టు 29: సింధూ నదీ జలాల ఒప్పందం, దానికి సంబంధించిన వివిధ సమస్యలపై పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య బుధవారం చర్చలు ప్రారంభమయ్యాయి. పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల్లో మొదటి రౌండ్ చర్చలు పాక్‌లోని నేషనల్ ఇంజనీరింగ్ సర్వీస్‌లో జరిగాయి. కాగా రెండు దేశాలకు చెందిన వాటర్ కమిషనర్ల బృందం ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ ప్రాజెక్టులు, సైట్లు, రివర్ హెడ్ వర్క్‌లను పరిశీలించాల్సి ఉంది. అయితే ఈ విషయంలో పాకిస్తాన్ పలు సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీటిపై సమావేశాలు నిర్వహించడం కాని, ప్రాజెక్టులను సందర్శించడం కాని చేయడం లేదు. దాంతో ఇరుదేశాల మధ్య పలు అంశాలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మళ్లీ చర్చలకు అడుగుపడింది. భారత్ నుంచి వచ్చిన బృందానికి వాటర్ కమిషన్ కమిషనర్ పికె సక్సేనా నేతృత్వం వహిస్తుండగా, పాక్ బృందం సయ్యద్ మెహర్ అలీషా నాయకత్వంలో చర్చల్లో పాల్గొంటోంది. ఇరుదేశాలు తమతమ నివేదికలు చర్చల సందర్భంగా సమర్పించనున్నారు. చర్చల అనంతరం ఇరుదేశాలు కలిసి ఒక ప్రకటన విడుదల చేస్తారని భావిస్తున్నారు. మంగళవారం తొమ్మిది మంది ప్రతినిధులతో వాఘా సరిహద్దు ద్వారా పాక్ చేరుకున్న భారత్‌కు చెందిన సక్సేనా బృందాన్ని పాక్ అధికారులు ఆహ్వానించారు.
తొమ్మిదేళ్లపాటు జరిగిన చర్చల అనంతరం 1960లో పాక్-్భరత్ దేశాల మధ్య ఇండస్ జలాల సంధి జరిగింది. జలాల వినియోగం, ఇరుదేశాల మధ్య సమాచార మార్పిడి, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై ఒప్పందం జరిగింది. అయితే తర్వాత ఇరుదేశాల మధ్య ఇవే అంశాలపై విభేదాలు తలెత్తాయి. చెనబ్ నదిపై భారత్ చేపడుతున్న రెండు భారీ జలాశయాల నిర్మాణంపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, అయినా భారత్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని షా ఇదివరకే ప్రకటించారు. వివాదాస్పద రీతిలో భారత్ చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టుల విషయంలో ఆ దేశం సమాధానం చెప్పి తీరాల్సిందేనని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఇండస్ వాటర్ మాజీ కమిషనర్ సయ్యద్ జమాత్ అలీ షా పీటీఐతో మాట్లాడుతూ కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వమూ భారత్‌తో ఉన్న జలవివాదాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయని విమర్శించారు. అయితే ఈ విషయంలో పాక్ అభ్యంతరాలను భారత్ పట్టించుకోవడం లేదన్నారు.