జాతీయ వార్తలు

గొర్రెల కాపర్ల ప్రగతికి ప్రత్యేక పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉన్న కురుబ, ధనగర్ తదితర గొర్రెల కాపర్ల రాజకీయ, సామాజిక, ఆర్థికాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందిస్తోందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గొర్రెలు, మేకల అభివృద్ధికి జాతీయ స్థాయి సంస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని గడ్కరీ తెలిపారు. గడ్కరీ బుధవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లోని డిప్యూటీ స్పీకర్ ఆడిటోరియంలో రాష్ట్రీయ సమాజ్ ప ఏర్పాటు చేసిన జాతీయ గొర్రెల కాపర్ల సదస్సులో ప్రసంగించారు. రాష్ట్రీయ సమాజ్ ప అధ్యక్షుడు, మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి మహదేవ్ జానకర్ ఏర్పాటు చేసిన గొర్రెల కాపర్ల సదస్సుకు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రా, హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన ధనగర్, కురుబ, కరుమ, పాల్ తదితర గొర్రెల కాపర్లు హాజరయ్యారు. ధన్‌గర్, కురుబ తదితర గొర్రెల కాపర్లు ఇండోర్ మహారాణి అహల్యాభాయి హోల్కర్ చూపిన బాటలో ముందుకు సాగాలని ఆయన సూచించారు. సమాజంలోని ఏ వర్గమైన అభివృద్ధి సాధించాలంటే మొదట ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్నారు. గొర్రెల కాపర్ల సర్వతోముఖాభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందిస్తోందన్నారు. గొర్రెల కాపర్లు తయారుచేసే గొంగళ్లకు మంచి మార్కెట్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. గొర్రె వెంట్రుకల నుండి సేకరించే అమినో ఆసిడ్స్ ద్వారా నాణ్యమైన ఎరువులను తయారు చేయవచ్చునని, తన నియోజకవర్గంలో తానీ కార్యక్రమాన్ని చేపట్టానని గడ్కరీ చెప్పారు. మహారాణి అహల్యాభాయి హోల్కర్ జన్మస్థానాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. అహల్యాభాయి హోల్కర్ దేశంలోని అన్ని తీర్థస్థానాల్లో విడిది గృహాలు నిర్మించటం ద్వారా హిందూమత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఆయన ప్రశంసించారు. గొర్రెల అభివృద్ధికి జాతీయ స్థాయి సంస్థను ఏర్పాటు చేసే విషయం పరిశీలనలో ఉన్నదని ఆయన వెల్లడించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ మాట్లాడుతూ జాతీయ వెనుకబడిన కులాల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించటం ద్వారా ధన్‌గర్ తదితర గొర్రెల కాపర్ల ప్రయోజనాల పరిరక్షణకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. స్వాభిమానంతో జీవించటం ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు గొర్రెల కాపర్లు కృషి చేయాలన్నారు. ధన్‌గర్, కురుబ, కురుమలు గొర్రెల పెంపకాన్ని ఒక పరిశ్రమగా అభివృద్ధి చేయాలి.. ఆధునిక పద్దతుల్లో గొర్రెలను పెంచటం ద్వారా సత్వర ఆర్థికాభివృద్ధి సాధించాలని హంస్‌రాజ్ అహిర్ సూచించారు. కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ గొర్రెల కాపర్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. రాష్ట్రీయ సమాజ్ ప అధ్యక్షుడు మహదేవ్ జాన్‌కర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వికాస్ మహాత్మే మాట్లాడుతూ గొర్రెల కాపర్ల సర్వతోముఖాభివృద్ధికి తమ పోరాటం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. మహదేవ్ జాన్‌కర్ మొదట కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హంస్‌రాజ్ అహిర్, గిరిరాజ్ సింగ్‌లకు గొంగడి కప్పి సన్మానించారు.