జాతీయ వార్తలు

వ్యూహాలపై చర్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహగానాల నేపధ్యంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసారించల్సిన వ్యూహంపై పీసీసీ, హైకమాండ్‌తో చర్చిస్తున్నది. అందులో భాగంగానే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సీ కుంతియా గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశపై సుమారు రెండు గంటలకుపైగా సుదీర్ఘ చర్చలు జరిపారు. తెలంగాణ పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, ఎన్నికలకు సంబంధించిన పార్టీ కమిటీల ఏర్పాటుపై అధిష్ఠానంతో చర్చలు జరిపినట్టు సమాచారం. వచ్చే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పార్టీకి సంబంధించిన ‘ప్రచార కమిటీ’,‘మానిఫెస్టొ కమిటీ’, ‘వర్కింగ్ ప్రెసిడెంట్ల’నియామకాలపై ఆశావాహుల పేర్లును ఉత్తమ్, కుంతియా హైకమాండ్‌కు అందిచారు. అలాగే, టీఆర్‌ఎస్ భారీ స్థాయిలో తలపెట్టిన ‘ప్రగతి నివేదన సభ’కు కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ‘జన ఆవేదన సభలు’కు సంబంధించిన వివరాలను హైకమాండ్‌కు ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ నిర్వహించే జన ఆవేదన సభకు సోనియాగాంధీని హాజరైయ్యేలా చూడాలని రాహుల్‌కు ఉత్తమ్ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పొత్తులతో వెళ్లాలా? వద్దా? ఒంటరిగానే పోటీ చేయాలా? అనే అంశాలపై కూడా రాహుల్‌తో పీసీసీ నేతలు చర్చలు జరిపినట్టు సమాచారం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే టీఆర్‌ఎస్‌ను ఏలా ఎదుర్కొవచ్చు, దాని ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనే అంశాలపై కూడా హైకమాండ్‌తో జరిపిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ కార్యవర్గం, దాని అనుబంధ కమిటీలను పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఖరారు చేయనున్నారు.