జాతీయ వార్తలు

వ్యూహాత్మక ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రధాని నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌తో సమావేశంకానున్నారు. పార్లమెంటు ఆవరణలోని గులాంనబీ ఆజాద్ కార్యాలయంలో ఉదయం 11.15 గంటలకు చంద్రబాబు భేటీ అవుతారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోమవారం గులాంనబీ ఆజాద్‌ను పార్లమెంటు ఆవరణలో కలిసి ఈమేరకు అప్పాయింట్‌మెంట్ తీసుకున్నారు. అనంతరం ఆజాద్ సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో సమావేశమై చంద్రబాబుతో జరపాల్సిన చర్చల గురించి సమాలోచనలు జరిపారు. ఏపీని యూపీఏ అశాస్ర్తియంగా విభజించిందని, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఇంతకాలం విమర్శలు గుప్పిస్తూ వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు నరేంద్ర మోదీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ అగ్రనాయకులతో భేటీకి సిద్ధపడటం ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉంటే చంద్రబాబు మంగళవారం పార్లమెంటులోని సెంట్రల్ హాల్‌లో ప్రతిపక్షానికి చెందిన వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం కానున్నారు. సీఎం రమేష్, ఇతర తెలుగుదేశం నేతలు సోమవారం ప్రతిపక్షానికి చెందిన వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిసి చంద్రబాబు సమావేశం గురించి చర్చించారు. చంద్రబాబు మంగళ, బుధవారాలు ఢిల్లీలో మకాం వేసి పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై బీజేపీని ఓడించాల్సిన ఆవశ్యకతపై చర్చించనున్నారు. అందుకు అనుసరించవలసిన వ్యూహం గురించీ ఆయన ఆయా పార్టీల నేతలతో చర్చిస్తారు. మోదీని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేయాల్సిన ప్రత్యామ్నాయ వేదిక గురించి స్పష్టత తెచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.