జాతీయ వార్తలు

జోనల్‌కు రాజముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 30: స్థానికులు దాదాపుతొంభై ఐదు శాతం ఉద్యోగాలు పొందడానికి వీలు కల్పించే తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఈ మేరకు గురువారం రాజపత్రాన్ని జారీ చేయటంతో, మరు క్షణం నుంచే రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోరిన విధంగా ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు ఆమోదముద్ర వేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. తాజాగా రూపొందించిన జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లా జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాల్లో 95 శాతం ఉద్యోగాలను స్థానికులకు రిజర్వు చేశారు. కేవలం ఐదు శాతం ఉద్యోగాలు మాత్రమే ఓపెన్ క్యాటగిరీలో ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని శాఖలకూ కలిపి ఒకే రకమైన జోన్ల విధానం, పోలీసు శాఖకు మరో రకమైన జోన్ల విధానాన్ని ఇందులో పొందుపరిచారు. కొత్త జోనల్ వ్యవస్థ వెంటనే అమలులోకి వస్తుందని రాష్టప్రతి రాజపత్రంలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖలకు వర్తించే మొదటి మల్టీ జోన్‌లో కాళేశ్వరం జోన్, బాసర జోన్, రాజన్న జోన్, భద్రాద్రి జోన్ ఉన్నాయి. రెండో మల్టీ జోన్‌లో యాదాద్రి జోన్, చార్మినార్ జోన్, జోగులాంబ జోన్ ఉన్నాయి. మొదటి జోన్ కాళేశ్వరంలో ఆసిఫాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. రెండో జోన్ బాసరలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగత్యాల జిలాలు, మూడో జోన్ రాజన్నలో కరీంనగర్, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు ఉంటాయి. నాలుగో జోన్ భద్రాద్రిలో కొత్తగుడెం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, గ్రామీణ వరంగల్, పట్టణ వరంగల్ జిల్లాలున్నాయి. రెండో మల్లీ జోన్‌లోని ఐదో జోన్ యాద్రాద్రిలో సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి-యాద్రాద్రి, జనగామ జిల్లాలు ఉన్నాయి. ఆరో జోన్ చార్మినార్‌లో మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఏడో జోన్ జోగులాంబలో వికారాబాద్, మహబూబ్‌నగర్, జోగులాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నాయి.
పోలీస్ శాఖలో..
పోలీస్ శాఖకు సంబంధించిన మొదటి మల్లీజోన్‌లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు ఉంటే రెండో మల్లీ జోన్‌లో యాద్రాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు ఉన్నాయి. మొదటి మల్టీ జోన్‌లోని మొదటి జోన్ కాళేశ్వరంలో భూపాలపల్లి-జయశంకర్, ఆసిఫాబాద్, కొమురం భీమ్, రామగుండం పోలీస్ కమిషనరేట్‌లు ఉంటాయి. రెండో జోన్ బాసరలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లతోపాటు జగత్యాలను కూడా చేర్చారు. మూడో జోన్ రాజన్నలో కరీంనగర్ పోలీస్ కమిషనర్, సిద్దిపేట పోలీస్ కమీషనర్, సిరిసిల్ల-రాజన్న, కామారెడ్డి, మెదక్ జిల్లాలు వస్తాయి. నాలుగో జోన్ భద్రాద్రిలో కొత్తగుడెం-్భద్రాద్రి, ఖమ్మం పోలీస్ కమిషనర్లు, మహబూబాబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లు వస్తాయి. రెండో మల్లీ జోన్‌లోని ఐదో జోన్ యాద్రాద్రిలో సూర్యాపేట, నల్గొండ, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు ఉంటాయి. ఐదో జోన్ చార్మినార్‌లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సంగారెడ్డి ఉంటాయి. ఏడో జోన్ జోగులాంబలో మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్-జోగులాంబ, నాగర్ కర్నూలు, వికారాబాద్‌లు ఉంటాయి.
ఆరు నెలల వ్యవధి!
రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి ముఫై ఆరు నెలల్లోగా సివిల్ సర్వీస్ పోస్టులు, లోకల్ క్యాడర్ పోస్టులను కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, లేదా సత్సమానమైన ఇతర పోస్టులు లేదా దీనికంటే తక్కువ స్థాయి పోస్టులను ప్రతి జిల్లాల్లో ప్రత్యేక క్యాడర్‌గా నిర్వహించవలసి ఉంటుంది. ప్రతి జిల్లాను స్థానిక ప్రాంతం (లోకల్ ఏరియా)గా పరిగణించటంతోపాటు రిక్రూట్‌మెంట్ అప్పాయింట్‌మెంట్, ఇతర అన్ని సంబంధిత పనులకు ప్రత్యేక యూనిట్‌గా ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అవసరాల మేరకు ఒక జోన్ నుండి జోనల్ వ్యవస్థ వర్తించని కార్యాలయాలకు బదిలీలు చేయవచ్చు. అయితే, ఒక జోన్ నుండి మరో జోన్‌కు బదిలీ చేసే సమయంలో సీనియారిటీని తప్పకుండా పాటించవలసి ఉంటుంది.

సీఎం కృతజ్ఞతలు
జోనల్ వ్యవస్థకు సంబంధించిన గెజెట్ విడుదల కావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి, ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, రాజముద్ర వేసిన రాష్టప్రతి రాజనాథ్ కోవింద్‌కు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.