జాతీయ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్ సభకు వెళ్లకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 30: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ ప్రసంగ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కావటం లేదు. ఆర్‌ఎస్‌ఎస్ సెప్టెంబర్ 17 నుండి 19 తేదీ వరకు మూడు రోజుల పాటు ఢిల్లీలోని విజాన్ భవన్‌లో సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ప్రసంగ సమావేశం నిర్వహిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ మొదటిసారి నిర్వహిస్తున్న ఈ ప్రసంగ కార్యక్రమంలో సంఘ్ అధినాయకుడు ‘్భరత దేశం భవిష్యత్తు- ఆర్‌ఎస్‌ఎస్ దృష్టికోణం’ అనే అంశంపై ప్రసంగిస్తారు. కాగా, ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ను కూడా ఆహ్వానిస్తున్నట్టు ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ తదితరులు గురువారం ఢిల్లీలో సమావేశమై ఆర్.ఎస్.ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ ప్రసంగ కార్యక్రమానికి రాహుల్ హాజరు కాకూడదని నిర్ణయించారు. మోహన్ భగవత్ మూడు రోజుల పాటు ప్రసంగించటంతోపాటు ఈ సదస్సుకు హాజరయ్యే ప్రముఖులతో వివిధ అంశాలపై ఇష్టాగోష్టి చర్చలు కూడా జరుపుతారు. ఆయన ప్రసంగ కార్యక్రమానికి రాహుల్‌తోపాటు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితర ప్రముఖులను ఆహ్వానించాలని సంఘ్ నాయకులు నాయకులు భావించారు. అవకాశం లభించిన ప్రతిసారీ ఆర్‌ఎస్‌ఎస్‌పై నిప్పులు చెరుగుతున్న రాహుల్, సీతారాం ఏచూరి తదితర నాయకులకు తమ ఆలోచనా విధానం గురించి తెలియజేయాలన్నది సంఘ్ ఆలోచన. రాహుల్ ఇటీవల తన విదేశీ పర్యటన సంధర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ను ఈజిప్ట్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ బ్రదర్‌హుడ్ సంస్థతో పోల్చి న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ను తమ అధినాయకుడి ప్రసంగ కార్యక్రమానికి ఆహ్వానించాలని ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయించటం ప్రాధాన్యతను సంతరించకున్నది. గతంలో మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నాగపూర్‌లో సంఘ్ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించుకోగానే ఆయనపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించటం తెలిసిందే. ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి హాజరు కాకూడదంటూ అప్పట్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రణబ్ ముఖర్జీకి సలహా ఇచ్చారు. ప్రణబ్ తన నిజస్వరూపాన్ని బైట పెట్టారంటూ కాంగ్రెస్ నాయకులు ఆయనపై బురద చల్లారు. మోహన్ భగవత్ ప్రసంగ కార్యక్రమానికి రాహుల్ హాజరు కావటం ఎంత మాత్రం మంచిది కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఇస్లామిక్ బ్రదర్‌హుడ్ సంస్థతో పోల్చిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి హాజరు కావటం ఏ విధంగానూ సమర్థనీయం కాదన్నది వారి వాదన. ఆర్‌ఎస్‌ఎస్ హాజరైతే కాంగ్రెస్ మైనారిటీల ఓట్లు కోల్పోవటం ఖాయమని నాయకులు భావిస్తున్నారు. మోహన్ భగవత్ ప్రసంగ కార్యక్రమానికి హాజరై వివాదాలు కొని తెచ్చుకునే బదులు దానికి దూరంగా ఉండటమే మంచిదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్టీ అధినాయకుడికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా మోహన్ భగవత్ ప్రసంగ కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చని సమాచారం.