జాతీయ వార్తలు

‘నగదు లావాదేవీలు తగ్గాయ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: రెండేళ్ల క్రితం దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం నగదు లావాదేవీలు తగ్గి డిజిటల్ చెల్లింపుల శాతం పెరిగిందని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్‌కుమార్ తెలిపారు. 2016లో 500, వెయ్యి రూపాయల నోట్ల రద్దు తర్వాత రిజర్వ్‌బ్యాంకు నిన్ననే తన వార్షిక నివేదికలో దానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. రద్దు చేసిన నోట్లలో 99.3శాతం బ్యాంకులకు చేరుకున్నట్టు తెలియజేసింది. నల్లధనాన్ని అరికట్టడానికి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో మోదీ ప్రభుత్వం ప్రకటించినా, 99.30 శాతం తిరిగి బ్యాంకులకు చేరుకోవడం చూస్తే ఆయన నిర్ణయం తప్పని తేలిందని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో రాజీవ్‌కుమార్ గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నోట్ల రద్దు ఉద్దేశం తిరిగి తక్కువ డబ్బు వ్యవస్థలోకి రావడం అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఈ నిర్ణయం మార్కెట్‌పై, మార్కెట్ మనస్తత్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన విషయం మరువరాదని అన్నారు. ఈ నిర్ణయం జరగకముందు జరిగిన నగదు లావాదేవీలెన్ని? ఇప్పుడు జరుగుతున్నవి ఎన్నో గమనించాలన్నారు. దేశంలో చమురు ధరలు అధికంగా పెరిగినప్పుడు దానిని అదుపు చేయడానికి ప్రధాని మోదీ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, ఈ విషయం ప్రభుత్వ నిరంతర పరిశీనలో ఉందని ఆయన తెలిపారు.