జాతీయ వార్తలు

హన్మన్నకు కోపం వచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ. హనుమంత రావుకు కోపం వచ్చింది. ముక్కుసూటిగా మాట్లాడే హన్మన్న ఇటీవల కాలంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిమాణాల పట్ల ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అందుకే, పార్టీకి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. విషయం ఏమిటంటే.. రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేసే కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్ష పదవిని వీహెచ్ ఆశిస్తున్నారు. ఆ బాధ్యతను ఇవ్వకపోతే కఠిన నిర్ణయం తీసుకుంటానని సన్నిహితుల వద్ద స్పష్టం చేశారని అంటున్నారు. రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడుగా నియమించకపోతే కఠిన నిర్ణయం తీసుకోవటం అంటే పార్టీకి రాజీనామా చేయటమేనని చాలా మంది విశే్లషిస్తున్నారు. వీహెచ్ కొంత కాలం నుండి పార్టీ అధినాయకత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఏఐసీసీ కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న హన్మన్నకు పార్టీ అధినాయకత్వం ఇంత వరకు నిర్ధిష్టంగా ఏ పనీ కేటాయించలేదు. దీనితో ఆయన నామమత్రపు కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఏఐసీసీ కార్యదర్శి బాధ్యతలు ఇచ్చిన అధినాయకత్వం తనకు పని ఎందుకు కేటాయించటం లేదన్నది హనుమంతరావుప్రశ్న. వీహెచ్‌కు పని కేటాయించకపోవడమంటే పొమ్మనకుండా పొగపెట్టటమేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం రాష్ట్ర శాస సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేసి ప్రచార కమిటీ అధ్య క్ష పదవి ఇవ్వకపోతే ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పి నా ఆశ్చర్యపోకూడదని ఆయన సన్నిహితులు అంటున్నారు.

త్వరలో పీసీసీ కార్యవర్గం ఏర్పాటు
కాంగ్రెస్ అధినాయకత్వం అతిత్వరలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)కి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించనున్నది. అధినాయకత్వం ఆదేశాల మేరకు గురువారం ఉదయం హుటాహుటిన ఢిల్లీకి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సమావేశమై పీసీసీకి కొత్త కార్యవర్గం ఏర్పాటుపై చర్చించారు. పీసీసీ కార్యవర్గంతోపాటు వివిధ అనుబంధ కమిటీలు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కమిటీలు కూడా ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ పదవులు దొరుకుతాయన్నది ఉత్కంఠ రేపుతున్నది.