జాతీయ వార్తలు

మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తే ఓడించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వని పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓటు వేయరాదని జాతీయ మహిళా సంఘాల వేదిక (ఎన్‌ఏడబ్ల్యువో) పిలుపునిచ్చింది. మహిళల హక్కులను కాలరాచే విధంగా వ్యవహరించే పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ఈ సంస్థ కోరింది. దాదాపు వంద మహిళా సంఘాలు ఒక వేదికపైకి వచ్చి తమ గొంతును బలంగా వినిపించాయి. ఈ వివరాలను వేదిక తరఫున డైరెక్టర్ ఆప్ సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చి డాక్టర్ రంజన కుమారి వెల్లడించారు. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోవడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల మహిళల సమస్యలను పట్టించుకోవడం మానివేశారన్నారు. భారతపార్లమెంటులో 12 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారన్నారు. రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం వల్ల మహిళల ప్రాతినిధ్యం 33 శాతానికి పెరుగుతుందన్నారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు, ఇతర నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. మహిళల సమస్యలను సరైన విధంగా వినిపించడంలో పార్టీలు విఫలమవుతున్నాయన్నారు. కొన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించడం తగదన్నారు. రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఐదు వేల ఉత్తరాలను ప్రధానమంత్రికి పంపామన్నారు. 22 ఏళ్లుగా ఈ బిల్లు చట్టసభల్లో నలుగుతోందన్నారు. రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీలు ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ఆమె నిలదీశారు. 2010లోనే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిందన్నారు. దేశ జనాభాలో మహిళలు 49 శాతం ఉన్నారన్నారు. మహిళల హక్కులను అణచివేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. 543 మంది లోక్‌సభ సభ్యుల్లో కేవలం 65 మంది మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారన్నారు. రాజ్యసభలో 243 మంది ఎంపీల్లో 31 మంది ఎంపీలు ఉన్నారన్నారు. ప్రపంచంలో చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే దేశాల్లో భారత్ 103వ స్థానంలో ఉందన్నారు.