జాతీయ వార్తలు

ఎంపీ ల్యాడ్స్ పనులకు జియో ట్యాగింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఒకసారి చేసిన అభివృద్ధి పనులకు మరోసారి నిధులు కేటాయించకుండా నివారించేందుకు దేశంలోని వంద జిల్లాల్లో ఎంపీ ల్యాడ్స్ పథకం కింద జరుగుతున్న పనులను జియోట్యాగింగ్ చేస్తున్నట్టు కేంద్ర గణాంకాల శాఖ మంత్రి డివి సదానంద తెలిపారు. ఈ పథకంపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగిన అనంతరం గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్)ను ఉపయోగించడం ద్వారా పార్లమెంట్ సభ్యులు ఎంపీ ల్యాడ్ నిధులను తమకు నచ్చిన అభివృద్ధి పనులకు కేటాయించేందుకు వీలుగా ఎంపీ ల్యాడ్స్ పోర్టల్‌లో వాటి వివరాలను ఉంచుతున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ పథకం కింద చేపట్టే వందజిల్లాల్లోని పనులను జియోట్యాగింగ్ చేశామని, దీనివల్ల ఒకే పనికి రెండుసార్లు నిధులివ్వకుండా డూప్లికేషన్‌ను నివారించవచ్చునని ఆయన చెప్పారు. ఈ సౌకర్యం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎంతో ఉపయోగకారిగా ఉంటుందన్నారు. కొన్నిసార్లు ఒకేపనికి రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు నిధుల కేటాయింపు జరుగుతోందని, ఇకముందు అలా జరగకుండా జియోట్యాగింగ్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఎంపీ ల్యాడ్స్ పథకం కింద తమతమ ప్రాంతాల్లో చేపడుతున్న పనులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయా రాష్ట్రాల అధికారులు వెంటనే తమకు అందించాలని ఆయన కోరారు. ఈ పథకం కింద చేపట్టిన నిధుల్లో ఈ ఏడాది జూలై నాటికి 75శాతాన్ని మాత్రమే వినియోగించారని చెప్పారు. చాలాచోట్ల పనులు నెమ్మదిగా జరగడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ ల్యాడ్స్ కింద ఈ ఏడాది 7,097 కోట్లనిధులు కేటాయించగా, 2,932 కోట్లు ఇంకా ఉపయోగించ లేదని ఆయన చెప్పారు. 17 రాష్ట్రాల్లో ఇంకా పది శాతం నిధులు వాడకుండా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ పథకం కింద పనులు పూర్తి చేయడానికి 18 నెలలు, తర్వాత వాటికి సంబంధించిన పద్దులు, ఇతర వివరాలు సమర్పించడానికి మూడునెలల సమయం నిర్దేశించామన్నారు. అయితే 15వ లోక్‌సభకు సంబంధించి విడుదలైన నిధులకు సంబంధించి 318 ఖాతాలకు సంబంధించి పద్దులు ఇంకా క్లోజ్ చేయలేదని ఆయన చెప్పారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయడంలో హర్యానా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిసా ముందున్నాయని ఆయన ప్రశంసించారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు రాష్ట్రం, కేరళ, మహారాష్ట్ర అత్యధికంగా నిధులను వినియోగించాయని కేంద్రమంత్రి డివి సదానంద్ వెల్లడించారు.