జాతీయ వార్తలు

2020 నాటికి గంగా ప్రక్షాళన ప్రాజెక్టు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 30: గంగా నది ప్రక్షాళన కార్యక్రమం 2020 నాటికి పూర్తవుతుందని కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ చెప్పారు. ప్రక్షాళన కార్యక్రమం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. మొత్తం 221 ప్రాజెక్టు పనులను రూ.22,238 కోట్లతో చేపట్టామన్నారు. నమామి గంగ ప్రాజెక్టు ప్రతిష్టాకరమైనదని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. 2020 మార్చి నాటికి గంగా ప్రక్షాళన పూర్తి చేస్తామన్నారు. ఇది ఒక సంక్లిష్టమైన సవాలుతో కూడిన ప్రాజెక్టు అని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్దేశించిన పనుల్లో 70 నుంచి 80 శాతం పూర్తవుతాయన్నారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పనులను రియల్ టైంలో నిర్దేశించినిట్లుగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రాజెక్టు పనుల బాధ్యత ప్రైవేట్ సంస్థలకు ఇచ్చామన్నారు. గురువారం ఇక్కడ ఇండియన్ మర్చెంట్స్ చాంబర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో గంగానది ప్రక్షాళన పనులు చేపట్టామన్నారు. రోడ్డు విభాగంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానాన్ని చేపట్టామన్నారు. మురికినీటి శుద్ధి ప్రాజెక్టు పనులను నిపుణుల పర్యవేక్షణలో చేపట్టామన్నారు. త్వరలో నదుల ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను చేపట్టనున్నట్లు చెప్పారు. హాల్డియా, పాట్న మధ్య ఈ వ్యవస్థను అమలు చేయనున్నట్లు చెప్పారు. వారణాసి వరకు జల రవాణా వ్యవస్థను విస్తరిస్తామన్నారు.