జాతీయ వార్తలు

త్వరలో మంత్రివర్గ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు ముగిసిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్‌డీకే కుమారస్వామి గురువారం ఇక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలుసుకున్నారు. సంకీర్ణప్రభుత్వం బాగా పనిచేస్తోందని, బలంగా ఉందని, మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వాలని కుమారస్వామి కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీని కుమారస్వామి మర్యాదపూర్వకంగా కలిశారని పేర్కొన్నారు. వచ్చే కొన్ని రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేయాలని రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత కుమారస్వామి విలేఖర్లతో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ, వివిధ కార్పోరేషన్లకు చైర్మన్ల నియామకం ప్రక్రియను త్వరలో చేపట్టనున్నట్లు చెప్పారు. కర్నాటకలో సంకీర్ణప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని, సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధరామయ్య అండదండలు పుష్కలంగా ఉన్నాయన్నారు.ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు విజయవంతంగా ముగిసిన సందర్భంగా తాను రాహుల్‌ను కలిసినట్లు చెప్పారు. సిద్ధరామయ్యతో విబేధాలు లేవన్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో కాంగ్రెస్ నుంచి 16 మంది, జేడీఎస్ నుంచి 10 మంది ఉన్నారన్నారు. ఈ నెల 31న రెండు పార్టీల సీనియర్లతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ భేటీ జరుగుతుందన్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారన్న వార్తలపై మాట్లాడుతూ ఆ ఆకాంక్ష ఉండడంలో తప్పేమీ లేదన్నారు. సంకీర్ణప్రభుత్వం సుస్థిరతకు సిద్ధరామయ్య కృషి చేస్తున్నారన్నారు. మరో సీనియర్ నేత దేశ్‌పాండేకు కూడా ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తన ముందున్న కర్తవ్యమన్నారు. రాష్ట్భ్రావృద్ధికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామన్నారు. రైతాంగ సంక్షేమం కోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామన్నారు. సమగ్ర కర్నాటక, సమృద్ధి కర్నాటక ఏర్పాటు తమ లక్ష్యమన్నారు. సంకీర్ణ ప్రభుత్వం విజయవంతంగా నడిచేందుకు కూటమిలోని పార్టీల ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న కొడగుప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరం చేశామని, పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నయన్నరు. రాష్ట్రంలో ఉత్తర కర్నాటకలో నెలకొన్న కరవు పరిస్థితులపై కేంద్ర పీఎంవో శాఖ సహాయ మంత్రితో చర్చించినట్లు ఆయన చెప్పారు.