జాతీయ వార్తలు

కేరళకు మరిన్ని నిధులు కేటాయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించాలని, అలాగే విదేశీ నిధులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఆ రాష్ట్రానికి చెందిన అఖిలపక్ష నేతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశాయి. 11మంది ఎంపీలతో కూడిన అఖిలపక్ష నేతలు గురువారం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ఇటీవల కేరళను ముంచెత్తిన వరదలు, వర్షాలకు రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతం అల్లకల్లోలమైందని, ఆగస్టు 8వరకు ఈ ప్రాంతంలో 320 మంది మృతి చెందారని తెలిపారు. తీవ్రంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్ర పునరుద్ధరణకు, బాధితులను ఆదుకోవడానికి కేంద్రం మరిన్ని నిధులను కేటాయించాలని, అలాగే విదేశీ నిధులపై అమలులో ఉన్న ఆంక్షలు సడలించి అధికమొత్తంలో సహాయం అందేలా చూడాలని కోరారు. కష్టంలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడానికి పార్టీలకు అతీతంగా తాము వచ్చి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్టు అఖిలపక్ష బృందం మంత్రికి విన్నవించింది. కాగా, అఖిలపక్ష నేతల్లో ఒకరైన కేంద్ర మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయంలో తగుచర్యలు తీసుకుంటానని సమస్యను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకుని వెళతానని తమ బృందానికి మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హామీ ఇచ్చారని చెప్పారు. ఇలావుండగా కేరళకే చెందిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్స్ కన్నానంతనం చైనా పర్యటనలో ఉన్నందున తమ బృందంతో రాలేకపోయారని నేతలు తెలిపారు. మంత్రిని కలిసిన బృందంలో ఆంటోనితో పాటు కెవి థామస్, కెసి వేణుగోపాల్, కె.సురేష్, ఆంటో ఆంటోని, ఎంకె రాఘవన్ (ఆల్ కాంగ్రెస్), సిపిఐ-ఎంకు చెందిన పి.కరుణాకరన్, పి.కె బీజూ, ప్రేమచంద్రన్ (ఆర్‌ఎస్‌పి), జోస్ కె మణి (కేరళ కాంగ్రెస్), జోస్ జార్జి ఉన్నారు. ఇలావుండగా కేరళలో జరిగిన నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇదివరకే పరిశీలించి తొలివిడతగా 600 కోట్ల సాయాన్ని ప్రకటించారు. కేరళకు విదేశాల నుంచి 700 కోట్ల రూపాయల సహాయం ఇస్తామని వచ్చిన వార్తల నేపథ్యంలో 2004లో యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు భారత్‌లో జరిగే ప్రకృతి వైపరీత్య బాధిత ప్రాంతాలను ఆదుకోవడానికి విదేశాలు చేసే సహాయం తీసుకోరాదని ఆంక్షలు ఉన్నందున వాటిని తిరస్కరించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే దీనిని బాధిత కేరళ రాష్ట్రం ఖండించింది. కష్టాల్లో ఉన్న తమ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి పెద్దమనసుతో వారు పంపే సహాయాన్ని కూడా స్వీకరించడానికి నిబంధనలు సడలించాలని కోరుతోంది. ఇలావుండగా వరదల బారిన పడిన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రాష్టవ్య్రాప్తంగా 483 మంది మృతి చెందినట్టు భావిస్తున్నారు. చాలామంది సహాయ శిబిరాల నుంచి తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లినా, ఇంకా 98వేల మంది శిబిరాల్లోనే తలదాచుకుని ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇలావుండగా తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకోవడానికి కేంద్రం మరింత సహాయాన్ని చేయాలని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ బుధవారం కోరారు. ఇప్పటివరకు ఉన్న ఎస్‌జిడిపి పరిమితిని కేంద్రం మూడు నుంచి 4.5 శాతానికి పెంచాలని, అలాగే ఇప్పడు వసూలు చేస్తున్న జిఎస్‌టిపై పది శాతం సెస్ విధించి రాష్ట్రం వినియోగించుకునేలా తమకు అనుమతి ఇవ్వాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.