జాతీయ వార్తలు

మీరేమంటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయాలన్న అంశంపై సమాధానం తెలపాలని ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్, ప్రతివాదిగా ఉన్న ధనగోపాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో భవనం నిర్మాణం పూర్తయ్యేవరకూ ఇప్పుడున్న హైకోర్టు విభజించకూడదని ఉమ్మడి హైకోర్టు డివిజన్ బెంచ్ 2015లో తీర్పునిచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను శుక్రవారం న్యాయమూర్తులు ఏకే సిక్రీ, అశోక్‌భూషణతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ముందుగా కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై 2015లో ఆదేశాలు ఇచ్చిందని, వాటిని సమీక్షించాలని దాఖలైన పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న ఉమ్మడి హైకోర్టు భవనంలోనే రెండు రాష్ట్రాల హైకోర్టులు ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన ధర్మాసనానికి తెలిపారు. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గీ వాదనలు వినిపించారు. తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య సంస్థలు, వివిధ అంశాల విభజన చేస్తున్న విధంగానే హైకోర్టును కూడా విభజన చేయాలన్నారు. న్యాయాధికారులు విభజన వివాదంలో కూడా ఇదే బెంచ్‌పై విచారణ జరుగుత్ను విషయాన్ని రొహత్గీ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు విభజన జరగకపోవడంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన సమర్ధించారు. ఉమ్మడి హైకోర్టు విభజనకు ఎంత కాలం గడువుఉందని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి అటార్నీ జనరల్ వివరణ ఇస్తూ ‘విభజన తరువాత పది సంవత్సరాలు ఉమ్మడి హైకోర్టు కొనసాగవచ్చు’అని బదులిచ్చారు. ‘ఉమ్మడి హైకోర్టులో చాలా భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఏపీకి కొత్త హైకోర్టు ఏర్పాటు చేసుకోనేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి’అని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకొచ్చిందని వేణుగోపాల్ వెల్లడించారు. అదే సమయంలో తెలంగాణ తరపుసీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గీ తన వాదన కొనసాగిస్తూ ‘ఇప్పుడున్న హైకోర్టును ఏపీకి ఇచ్చేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది’అని ధర్మాసనానికి తెలిపారు. ప్రస్తుత హైకోర్టులో తెలంగాణకు ఉండాల్సిన న్యాయమూర్తుల శాతం లేదని ఆయన చెప్పారు. దీనిపై ఏపీ ప్రభుత్వం, ఉమ్మడి హైకోర్టు, రిజిస్ట్రార్, ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ధనసాగర్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను న్యాయమూర్తులు రెండు వారాలకు వాయిదా వేశారు.