జాతీయ వార్తలు

చైనా కంటే మెరుగైన వృద్ధి రేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆసియాలో బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న చైనాను భారత్ అధిగమిస్తోంది. వృద్ధి రేటులో చైనాను అధిగమించి ముందుకు దూసుకెళుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధిరేటు నమోదుకావడమే అందుకు నిదర్శనం. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ ఈ వృద్ధి నమోదైనట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. తయారీ సంస్థలు, వ్యవసాయ రంగం పుంజుకోవడంతో ఇది సాధ్యమైందని తెలిపింది. ఇదే కాలానికి చైనాలో వృద్ధిరేటు 6.7 శాతం కావడం గమనార్హం. 2011-12 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం మాదిరిగానే, ప్రస్తుత క్వార్టర్‌లో దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 33.18 లక్షల కోట్ల రూపాయలతో స్థిరంగా ఉంది. స్థూల అదనపు విలువలో కూడా చెప్పుకోదగ్గ మార్పులేదు. గత ఆర్థిక సంవత్సరంలో, ఇదే కాలానికి వృద్ధిరేటు 8 శాతంకాగా, ఈసారి 0.4 శాతం పెరిగింది.