జాతీయ వార్తలు

బలమైన ఆధారాలున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 31: ఇటీవల అరెస్టయిన వామపక్ష తీవ్రవాద సానుభూతిపరులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేందుకు తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ముంబయి పోలీసులు శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు. మోదీ రాజ్‌ను అంతం చేయడానికి రాజీవ్ గాంధీ తరహాలో విపత్తును సృష్టించాలన్న ప్రస్తావన కూడా వీరి మధ్య సాగిన సంభాషణల్లో చోటు చేసుకుందని వారు చెప్పారు. ఈ కేసులో సానుభూతిపరుల ప్రమేయంపై తిరుగులేని ఆధారాలు లభించినట్లు ముంబయి పోలీసులు చెప్పారు. ఈ సంభాషణల్లో, ఉత్తర ప్రత్యుత్తరాల్లో మోడీ రాజ్ అనే పదాన్ని ప్రస్తావించినట్లు పోలీసులు పేర్కొన్నారు. రోనా విల్సన్ అనే మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడు పంపిన ఇమెయిల్‌లో ఈ ప్రస్తావన ఉందన్నారు. రోనా విల్సన్‌ను అరెస్టు చేశామని, ఈ వ్యక్తి ఈ మెయిల్‌ను ఒక మావోయిస్టు పార్టీ నేతకు పంపారని వివరించారు. ఈ వివరాలను అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరంవీర్ సింగ్ చెప్పారు. ఈ ఏడాది జూన్ నెలలో ఢిల్లీలో, కొరిగావ్ భీమా హింస ఘటనలో విల్సన్‌ను అరెస్టు చేశామని వివరించారు. అజ్ఞాతవాసంలో ఉన్న మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు, బయటి సానుభూతిపరుల మధ్య ఈ మెయిల్ సారంశంపై అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని, దీనికి సంబంధించి లేఖలు తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సానుభూతిపరుల ఇళ్లలో సోదాలునిర్వహించి వరవరరావుతో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేసిన విషయం విదితమే. కాగా సుప్రీంకోర్టు ఆదేశం మేరకు వీరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఇలావుంటే, ఈమెయిల్‌లో పేర్కొన్న సారాంశంతో కూడిన లేఖను రోనా విల్సన్ మావోయిస్టు పార్టీ నేత ప్రకాశ్‌కు రాశారని అదనపు డీజీ చెప్పారు. రైఫిల్స్ కోసం రూ. 8 కోట్ల నిధులు కావాలనే అంశం కూడా లేఖలో ఉందన్నారు. మోడీని హత్య చేసేందుకు కామ్రేడ్ కిషన్ కూడా కుట్రపన్నారన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయన్నారు. తాము అరెస్టు చేసిన ఆరుగురు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులకు కుట్ర కేసుతో సంబంధం ఉందని చెప్పేందుకు తిరుగులేని రుజువులు సేకరించామన్నారు. కాగా ముంబయిలో జిల్లా కలెక్టరేట్ల ఎదుట దళిత సంఘాలకు చెందిన నేతలు ధర్నా చేశారు. దళిత రచయిత సుధీర్ ధావలేను విడుదల చేయాలని వారు కోరారు. శుక్రవారం మహారాష్టల్రో పలు ప్రాంతాల్లో దళిత సామాజిక సంఘాల కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.