జాతీయ వార్తలు

బహిరంగ ప్రకటనల మార్గదర్శకాల ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: బహిరంగ ప్రకటనల విడుదలలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన కేంద్రం, ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టి శుక్రవారం ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. గతంలో బహిరంగ ప్రకటనల విషయంలో సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చిందని, అయితే వాటిని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సంజీవ్ జా వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ రంజన్ గోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆరురాష్ట్రాలు, కేంద్రం, బీజేపీకి నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లోగా తమ స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. అడ్వర్‌టైజ్‌మెంట్లు విషయంలో ఇవి సుప్రీం మార్గదర్శకాలను ఉల్లంఘించాయని, కోర్టు సూచించిన మేరకు కమిటీని ఏర్పాటు చేయలేదని ఆయన ఆరోపించారు. కాగా, ఒక కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై 2015 మే 13న సుప్రీం ఇచ్చిన తీర్పులో ప్రభుత్వాలు ఇచ్చే అడ్వర్‌టైజ్‌మెంట్ల విషయంలో కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. అవసరమైతే ఒక కమిటీని ఏర్పా టు చేయాలని సూచించింది. ఇదే విషయానికి సంబంధించి 2016, మార్చి 18న దీనికి సంబంధించి కొన్ని సవరణలు చేసింది. ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనల్లో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్టమ్రంత్రుల ఫొటోలు ఉండవచ్చునని పేర్కొంది.