జాతీయ వార్తలు

థర్డ్‌పార్టీ ఇన్సూరెన్సు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: కొత్త కార్లు, ద్విచక్ర వాహనాలకు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేస్తూ ఏర్పాటుచేసే నిబంధన శనివారం నుంచి అమలు జరగాల్సివుంది. కార్లకు మూడు సంవత్సరాలు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల కాలవ్యవధితో ఈ బీమా పథకం అమలు జరగాల్సివుంది. ఐతే ఈ నిబంధన అమలుకు మరికొంత గడువు పొడిగించాలంటూ వచ్చిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఇన్సూరెన్స్ రెగులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) 1938 చట్టం ప్రకారం ఏర్పాటైన జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (జిఐసీ) ఇచ్చిన దరఖాస్తుపై జస్టిస్ మదన్ బీ లోకుర్, అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇంతకు ముందు అత్యున్నత న్యాయస్థానం థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ అమలుకు విధించిన సెప్టెంబర్ 1 గడువును పొడిగించాల్సిందిగా చేసిన జీఐసీ విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. ప్రస్తుతం వాహనాల ఇన్సూరెన్స్ కాలపరిమితి ఏడాది మాత్రమే ఉంది. అయితే కార్లకు మూడేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల వంతున కాలవ్యవధి వుండేలా థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ను ఏర్పాటు చేయాలని, ఈ నిబంధన సెప్టెంబర్ 1కల్లా అమలు జరగాలని సుప్రీం కోర్టు గత జూలై 20న ఆదేశించింది. కోయంబత్తూర్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ రాజశేఖరన్ వేసిన ఒక పిటిషన్‌ను వ్యాజ్యంగా పరిగణించిన న్యాయస్థానం 2014 ఏప్రిల్ 22న రోడ్టు భద్రతపై ఓ కమిటీని ఏర్పాటుచేయడం జరిగింది. ఆ కమిటీ అనేక నివేదికలు ఇచ్చిన మీదట ఈ వ్యాజ్యానికి సంబంధించిన హియరింగ్ శుక్రవారం వచ్చింది. ఈక్రమంలో రోడ్డు భద్రతా చర్యలపై న్యాయస్ధానానికి సహాయకునిగా వ్యవహరిస్తున్న అమికాస్, న్యాయవాది గౌరవ్ అగర్వాల్ మాట్లాడుతూ ఇప్పటికే ఇందుకు సంబందించి ఐఆర్‌డీఏ తన ఆమోదాన్ని రోడ్డు భద్రతా కమిటీకి ఈనెల 28న సర్క్యులర్ ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు. అయితే ఐఆర్‌డీఏ సర్క్యులర్‌ను పూర్తిగా అధ్యయనం చేయాల్సివున్నందున థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ అమలు గడువును పొడించాల్సిందిగా జీఐసీ సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరింది. దీనిపై న్యాయస్థాన సహాయకుడు (అమికాస్) గౌరవ్ అగర్వాల్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు నిబంధనను అమలు చేయలేని పక్షంలో సెప్టెంబర్ 1నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సూచించారు. అలాగే రోడ్లపై కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలపై ఫిర్యాదులు చేయాల్సిందిగా పోలీసు శాఖను ఆదేశించాలన్న మరో విజ్ఞప్తిని సైతం సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. అలా ఆదేశించడానికి మేమెవరం? చట్టపరిధిలో పొలీసులు చర్యలు తీసుకుంటారని వ్యాఖ్యానించింది.