జాతీయ వార్తలు

నవ కేరళ నిర్మాణానికి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 31: వరదలు, భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలో పునర్మిర్మాణం పనులను వేగవంతంగా చేపట్టాలని, దీని కోసం నిధులను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా డ్యాంల గేట్లను ఇష్టం వచ్చినట్లు ఎత్తడం వల్ల వరద నీటి ఉధృతికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ఈ అంశంపై న్యాయవిచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో కేరళ రాజకీయాలు వేడెక్కాయి. కాగా నవ కేరళ నిర్మాణం కోసం విదేశాల నుంచి కూడా నిధులు సేకరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో స్థిరపడిన కేరళ ప్రజలు, విద్యా సంస్థలు, పారిశ్రామికవేత్తల నుంచి నిధులను సేకరించాలని మంత్రిమండలి తీర్మానించింది. కేరళ రాష్ట్ర నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళిక ఖరారుకు కేపీఎంజీని కనె్సల్టెంట్‌గా ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో రోడ్లు, భవనాలు, వంతెనల నిర్మాణం కోసం టాటా ప్రాజెక్టు లిమిటెడ్‌కు బాధ్యతలు అప్పగించారు. పంబ నది వద్ద పునర్నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, దీని కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టోమ్ జోస్ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. శబరిమలైలో స్వామి అయ్యప్ప యాత్ర నవంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో యాత్రికులకు సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి విజయన్ మాట్లాడుతూ నిధుల సేకరణ సవాలుగా మారిందన్నారు. విదేశాల్లో నిధులు సేకరించేందుకు మంత్రులు, అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గల్ఫ్‌దేశాలు, ఐరోపాదేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా,సింగపూర్ దేశాల్లో ఈ బృందం పర్యటిస్తుందనర్నారు. ఇంతవరకు సీఎం సహాయ నిధికి రూ.1026 కోట్ల నిధులు వచ్చాయన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న చిన్న వ్యాపారులకు రూ.10 లక్షల రుణాలు ఇస్తామన్నారు. వరదల వల్ల దాదాపు రూ.37 వేల కోట్ల నష్టం సంభవించినట్లు ఆయన చెప్పారు. ఈ వరదల్లో 483 మంది మరణించారన్నారు. 14 మంది గల్లంతయ్యారన్నారు.
గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్ష నాయకుడు
వరదలు సంభవించేందుకు దారితీసిన పరిస్థితులపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేత రమేష్ చిన్నితలా ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి విజయన్‌కు గవర్నర్ పంపించారు.