జాతీయ వార్తలు

మండిపోతున్న ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. వికృతమైన పన్నులు వడ్డిస్తూ లెవీ పేరుతో 11 లక్షల కోట్ల రూపాయలను లూటీ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. నింగినంటిన నిత్యావసరాల ధరలతో దేశంలోని అన్ని వర్గాలు, ముఖ్యంగా సామాన్య ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. విదేశాల్లో డీజిల్, పెట్రోల్ ధరలు చౌకగా లభిస్తుంటే దేశంలో మాత్రం జనం నడివిరిచే రేట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రజలను నరకయాతన పెడుతున్నారని సుర్జేవాలా ధ్వజమెత్తారు. క్రూరమైన పన్నులు విధిస్తూ మోదీ ప్రభుత్వం 11 లక్షల కోట్లరూపాయలు లాభపడిందని ఆయన తెలిపారు. ఇవి సరిపోనట్టు రకరకాల పన్నులు విధిస్తూ ప్రజలను దోచుకుతింటున్నారని ఆయన విరుచుకుపడ్డారు. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయని కాంగ్రెస్ నేత ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు, రవాణా రంగం తీవ్రంగా నష్టపోతోందని సుర్జేవాలా అన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని 2017 జూలైలోనే కాంగ్రెస్ డిమాండ్ చేసిందని ఆయన వెల్లడించారు. అయితే బీజేపీ ప్రభుత్వం తమ డిమాండ్‌ను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. నింగినంటిన ధరలపై దేశ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని రణ్‌దీప్ డిమాండ్ చేశారు. 2014 మే నెలలో లీటర్ పెట్రోల్‌పై ఎక్సయిజ్ డ్యూటీ 9 రూపాయల 2 పైసలుండగా ఇప్పుడని 19 రూపాయల 48 పైసలకు పెరిగిందని ఆయన వివరించారు. అలాగే 2014 మే నెలలో డీజిల్ లీటర్‌పై కేవలం 3 రూపాయల 46 పైసలు ఎక్సయిజ్ డ్యూటీ ఉండగా ఇప్పుడది 15 రూపాయల 33 పైసలై కూర్చుందని సుర్జేవాలా వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెంట్రల్ ఎక్సయిజ్ డ్యూటీ 12 రెట్లకు ఎగబాకిందని ఆయన విమర్శించారు. ఇక నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యులు కొనుగోలుచేయలేనంత దారుణంగా పెరిగిపోయాయని ఆయన తెలిపారు.