జాతీయ వార్తలు

డిసెంబర్‌లో ఎన్నికలు జరగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకవేళ హడావుడిగా రాష్ట్ర శాసన సభను రద్దు చేసినా, డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అంచనా వేశారు. బలవంతంగా ఎన్నికలను జరిపేందుకు ప్రయత్నిస్తే తాము కోర్టుకు వెళ్లి ఆపుతామని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ప్రకాశ్ రావత్‌ను కలిసి అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిపే అంశంపై ఒక వినతిపత్రం అందజేశారు. తెలంగాణ నుండి విడదీసి, ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఏడు మండలాలపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన పేర్కొన్నారు. అంతేగాక, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీటి విలీనంపైన సందిగ్ధం కొనసాగుతున్నదని తెలిపారు. ఏడు మండలాలను ఏపీకి సంబంధించి ఏ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గంలో కలిపినా డిలిమిటేషన్ చేసినట్లు అవుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఈ ప్రక్రియను ఇప్పటికిప్పుడు చేసేందుకు ఎంత మాత్రం వీలు లేదనేది కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్టు శశిధర్ రెడ్డి చెప్పారు. ఇంతవరకూ జమిలి ఎన్నికలకు ఓటు వేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు అకస్మాత్తుగా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిపించాలనుకోవటం వెనక ఓటర్ల జాబితాలో మార్పులుచేర్పులు చేసే కుట్ర దాగున్నదని ఆరోపించారు.
దీనికితోడు వీవీపీటీల నిర్వహణకు సంబంధించిన శిక్షణా కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదని గుర్తుచేశారు. ఓటర్ల జాబితాను సవరించే కార్యక్రమం 2019 జనవరిలో పూర్తి అవుతుందని, ఈ నేపథ్యంలో శాసన సభకు డిసెంబర్‌లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని తాను రావత్‌ను ప్రశ్నించినట్లు శశిధర్ రెడ్డి తెలిపారు. ఏడు మండాలను ఏపీలోని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో విలీనం చేసి, ఆతర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు గల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. ఏడు మండలాలకు సంబంధించిన చిక్కును రావత్‌కు వివరించగా ఆయన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారని శశిధర్ రెడ్డి తెలిపారు. కేంద్ర హోం శాఖ ఉత్తర్వుల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునంటూ టీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఇదిలావుంటే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలను తారుమారు చేసే కుట్ర చేస్తోందని, డిసెంబర్‌లో శాసన సభ ఎన్నికలు జరిపించటం ద్వారా తమ కుట్ర బైటపడకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నదని ఎన్నికల సంఘానికి శశిధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటర్ల జాబితాలను తారుమారు చేసిన విషయాన్ని ఎన్నికల సంఘానికి వివరించారు. మొదట ముందస్తుకు ఓటు వేసిన కేసీఆర్ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవటం వెనక ఉన్న మతలబు ఓటర్ల జాబితాలను తారుమారు చేయటమేనని ఆరోపించారు. ఈ అంశాలన్నింటిని రావత్ దృష్టికి తెచ్చి డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరపకూడదని డిమాండ్ చేసినట్లు శశిధర్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ బలవంతంగా శాసన సభకు ఎన్నికల జరిపించడానికి సిద్ధమైతే, తాము కోర్టుకు వెళతామని ఆయన ప్రకటించారు. ఓటర్ల జాబితాలు మారుమారైతే ఎన్నికల సంఘానికే చెడ్డపేరు వస్తుందని, రావత్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ కేంద్ర ఇటీవల ఎన్నికల సంఘాన్ని కలిసి ముందస్తు ఎన్నికలపై చేసిన ప్రతిపాదన ఏమిటనేది ప్రజలకు చెప్పాలని రావత్‌ను డిమాండ్ చేశానని అన్నారు.