జాతీయ వార్తలు

మోదీ వల్ల ఆర్థిక రంగంఅతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువ గరిష్ట స్థాయిలో దారుణంగా పడిపోవడంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాలే కారణమని పేర్కొంది. డాలర్ విలువతో పోల్చితే రూపాయి మారకం రూ.71కు చేరుకుందని, దీని వల్ల ఆర్థిక రంగం అతలాకుతలమైందన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిది రణదీప్ సూర్జీవాలా మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధికి మోడీనామిక్స్ (మోదీ ఆర్థిక విధానాలు) షాక్ ఇస్తున్నాయన్నారు. దేశీయ వ్యవస్థలను క్రమపద్ధతి ప్రకారం దెబ్బతీస్తున్నారన్నారు. వస్తుసేవా పన్నులో బోలెడు లోపాలు ఉన్నాయని, పెద్ద నోట్ల రద్దు ప్రమాదకరమైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. పన్ను భూతం వల్ల బ్యాంకింగ్ రంగం దెబ్బతిందన్నారు. రూపాయి ఈ రోజు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉందన్నారు. 2014 ఎన్నికల్లో అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ, ఈ రోజు ప్రజలను మోసం చేశారన్నారు. దేశీయ ఆర్థిక విధానాలు అధ్వాన్నంగా తయారయ్యాయన్నారు. దేశంలో ఆర్థిక విధానాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. కరెంటు అకౌంట్ లోటు పెరిగిందన్నారు. రూపాయి విలువ గత ఏడాదితో పోల్చితే పదిశాతం తగ్గిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విదేశీ పెట్టుబడులు గణనీయంగా తగ్గాయన్నారు.