జాతీయ వార్తలు

న్యాయ విభాగాల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: న్యాయ వ్యవస్థలోని విభాగాల్లో వౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని, కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు నిధుల లేమి పేరుతో ఉదాసీన వైఖరిని అవలంభిస్తే న్యాయపరిపాలనలో ప్రతిష్టంభన నెలకొంటుందని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. సత్వరమే న్యాయం అందించడంలో సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, వౌలిక సదుపాయాలు అనే అంశంపై సుప్రీం కోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థను బలోపేతం చేస్తే న్యాయమూర్తులు వేగంగా తీర్పులు ఇస్తారని, దీని వల్ల కక్షిదారులకు ఉపశమనం కలుగుతుందన్నారు. ఇప్పటికే దేశంలోని కోర్టుల్లో సరైన వౌలికసదుపాయాలు లేవు. ఈ పరిస్థితిని ఎంత కాలం కొనసాగిస్తారు. చాలీచాలని వసతి సదుపాయాల వల్ల పరిపాలనపై ప్రతికూల ప్రభావం పడుతుంది అని ఆయన అన్నారు. నిధులు లేవని తప్పించుకుంటే కుదరదన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వౌలిక సదుపాయాల కొరత అడ్డంకిగా మారిందన్నారు. ప్రభుత్వాలు న్యాయ స్థానాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలన్నారు. ఈ విషయంలో ఉదాసీన వైఖరిని అవలంభించరాదన్నారు. కోర్టుల్లో న్యాయవాదులకు, కక్షిదారులకు కనీస వౌలిక సదుపాయాలు లేవన్నారు. న్యాయ వ్యవస్థలో వౌలిక సదుపాయాలంటే బార్, లిటిగెంట్లు, న్యాయవాదులు వస్తారన్నారు. ఆ తర్వాత పదవ లా టీచర్ల దినోత్సవంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన న్యాయవిద్యను అందించేందుకు న్యాయ కళాశాలలు కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో మంచి న్యాయ కోవిదులను తయారు చేయాల్సిన బాధ్యత న్యాయ టీచర్లపైన ఉందన్నారు. ఏ దేశమైనా సుస్థిరతతో మనుగడ సాధించాలంటే రూల్ ఆఫ్ లా అవసరమన్నారు. సమాజాన్ని కొత్త కోణంలో అర్థం చేసుకునేందుకు, హక్కుల పరిరక్షణకు, పేదలకు న్యాయ సేవలు అందించేందుకు లాయర్లు చేస్తున్న కృషి నిరుపమానమైదన్నారు. నాణ్య మైన న్యాయ విద్య బోధిస్తే ప్రతిభావంతులైన విద్యార్థులు తయారవుతారన్నారు. న్యాయ విద్య కూడా సైన్స్ అని ఆయన చెప్పారు. సమాజంలో పౌరుల హక్కులు, బాధ్యతలను పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉంటుందన్నారు. విద్యార్థులు న్యాయ శాస్త్రాన్ని దీక్షతో, పట్టుదలతో చదవాలని ఆయన కోరారు. సమాజాన్ని అర్థం చేసుకోకుండా చదివితే ఉపయోగం లేదన్నారు. దేశంలో జాతీయ న్యాయ కళాశాలల పనితీరును ఆయన ప్రశంసించారు. న్యాయ విద్యలో ఉత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారన్నారు. న్యాయ విద్యలో ఐదేళ్ల కోర్సును ప్రవేశపెట్టడం మంచి పరిణామమన్నారు. సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలపై న్యాయ విద్యార్థులు చర్చించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ రూపొందించిన ఈ జర్నల్‌ను ఆవిష్కరించారు. కోర్టు రూంలలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువ న్యాయవాదులు వాదించేందుకు వీలుగా సీనియర్ న్యాయవాదులు అవకాశాలు కల్పించాలన్నారు.