జాతీయ వార్తలు

ఢిల్లీలో సీసీటీవీల ఏర్పాటు ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన సీసీ టీవీల ప్రాజెక్టుకు అసెంబ్లీ ఏర్పాటు చేసిన కమిటీ పూర్తి బాధ్యత వహించబోదని కమిటీకి సారధ్యం వహిస్తున్న అదనపుచీఫ్ సెక్రటరీ (హోం) మనోజ్ పరిదా పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రక్రియ కొనసాగుతుందని శనివారం నాడిక్కడ ఫీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఆయన తెలిపారు. ఈ కెమెరాల ఆపరేటింగ్ విధానానికి సంబంధించి ప్రభుత్వ బాధ్యతపై ఇప్పటివరకు నిర్ణయం జరగలేదన్నారు. సీసీ టీవీ ప్రాజెక్టులో డేటాను ఎవరు నియంత్రిస్తారు, ఇందుకు సంబంధించిన వీడియోలు దుర్వినియోగం అవుతున్నాయా అన్న అంశాలపై మాత్రమే తమ కమిటీకి బాధ్యత ఉంటుందని ఆయన చెప్పారు. సీసీ టీవీల ఏర్పాటు ప్రక్రియ మరో మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. సీసీ టీవీల ప్రాజెక్టులో 1.4 లక్షల కెమెరాల ఏర్పాటుకు సంబంధించిన నిర్థిష్టమైన ఆపరేటింగ్ విధానాన్ని ఏర్పాటుచేసే నిమిత్తం ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఓ ప్రత్యేక కమిటీ (ప్యానల్)ను ఏర్పాటు చేయగా కెమెరాల ఏర్పాటుకు పోలీసు లైసెన్సింగ్ ఉండాలని ప్యానల్ సూచించింది. దాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఐతే ఇప్పుడు పోలీసు లైసెన్సింగ్ గురించి ప్యానల్ నిబంధన విధించబోదని పరిదా చెప్పారు.