జాతీయ వార్తలు

మంచి చెబితే నొచ్చుకుంటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశంలో క్రమశిక్షణ నెలకొల్పేందుకు తాను ప్రయత్నిస్తుంటే ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విజ్ఞాన్ భవన్‌లో ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు రాసిన ‘మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వార్డ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వెంకయ్య నాయుడు ఉప రాష్టప్రతిగా గత సంవత్సరంలో తాను సాధించినదేమిటో వివరిస్తూ పుస్తకం రాశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో క్రమశిక్షణ లోపించిందని, దానిని నెలకొల్పేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను కొందరు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా చిత్రీకరిస్తున్నారని, మంచి చెబితే నొచ్చుకుంటారని అన్నారు. వెంకయ్యి నాయుడు క్రమశిక్షణకు మారుపేరని ఆయన ప్రశంసించారు. క్రమశిక్షణతో ఉండాలని ఎవరైనా చెబితే- ఆ చెప్పినవారిని ఏకఛత్రాధిపతి అని, నిరంకుశుడని విమర్శిస్తారు. నిఘంటువులోని అన్ని విమర్శలను గుప్పిస్తారని నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉప రాష్టప్రతిగా కొత్త కొత్త పనులు చేస్తున్నందుకు వెంకయ్యను అభినందిస్తున్నానని ఆయన అన్నారు. వెంకయ్య నాయుడు రాజ్యసభలో తనను తాను అదుపు చేసుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తారు.. అందులో ఆయన అనూహ్య విజయం సాధించారని ప్రధాన మంత్రి నవ్వుతూ చెప్పారు. రాజ్యసభ సజావుగా జరిగితే చైర్మన్ గొప్పతనం తెలియదు కానీ.. సభ గంగరగోళంలో పడ్డప్పుడే చైర్మన్ గొప్పతనం ఏమిటనేది తెలుస్తుంది.. సభను అదుపు చేసి నడిపించటంలో వెంకయ్య నాయుడు చూపే చొరవ, సామర్థ్యం తనకు ఇప్పుడిప్పుడే తెలుస్తోందన్నారు. వెంకయ్య నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు తాను ఆయన వద్ద ప్రధాన కార్యదర్శిగా పని చేసే అవకాశం లభించిందని మోదీ తెలిపారు. వెంకయ్యతో ఎన్నో సంవత్సరాల నుండి కలిసి పని చేస్తున్నానని అన్నారు. తాము టీమ్ వర్క్ చేశామని అన్నారు. పదవి ఏదైనా బాధ్యతల్లో మార్పు ఉండదు.. ఏ పదవైనా ఆయన నిష్టతో పని చేస్తారని అన్నారు. వెంకయ్య నాయుడు గత సంవత్సరంలో ఒకటి మినహా అన్ని రాష్ట్రాల్లో పర్యటించారు, ఆ ఒక్క రాష్ట్రానికి కూడా వాతావరణం అనుకూలంగా లేకపోవటం వలన హెలికాప్టర్ ఎగుర లేదు.. అందుకే వెళ్లలేకపోయారు.. హెలికాప్టర్ పనిచేస్తే ఆ రాష్ట్రంలో కూడా పర్యటించి వచ్చేవారని నరేంద్ర మోదీ ప్రశంసించారు. యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో వెంకయ్య ఎంతో నేర్చుకున్నారు.. తోటివారికి ఎంతో నేర్పించారని ప్రధాన మంత్రి అన్నారు. వెంకయ్యతో కలిసి పని చేసినందుకు తానెంతో గర్విస్తున్నానని మోదీ తెలిపారు. వెంకయ్య నాయుడు వద్ద పెన్ ఉండదు.. రిస్ట్‌వాచ్ ఉండదు.. జేబులో డబ్బు ఉండదు.. కాని సభలు, సమావేశాలకు గడువుకంటే ముందే వస్తారని నరేంద్ర మోదీ తెలిపారు. వెంకయ్య నాయుడు దూరదృష్టి, సమ్మిళిత దృష్టితో తనకిచ్చిన పనిని పూర్తి చేస్తారని అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు వెంకయ్య నాయుడును మంత్రివర్గంలో చేర్చుకుని మంచి శాఖ ఇవ్వాలనుకున్నారు.. అయితే నాయుడు మాత్రం వాజ్‌పేయిని కలిసి తనకు పెద్ద శాఖలు వద్దు గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించండి పూర్తినిష్టతో పనిచేస్తానని కోరినట్లు నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆయన వృత్తి, ప్రవృత్తి వ్యవసాయదారుడని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ‘ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన’ పథకం పటిష్టంగా అమలుకావటానికి ప్రధాన కారణం వెంకయ్య నాయుడేనని నరేంద్ర మోదీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం పెంచటంలో కూడా వెంకయ్య కీలకపాత్ర నిర్వహించారని అన్నారు. రాజ్యసభలో గ్రామీణాభివృద్ధి అంశాలు, వ్యవసాయరంగంపై చర్చకు ఉప రాష్టప్రతి అధిక ప్రాధాన్యత ఇస్తారని, ఆయన పద ప్రయోగం అద్భుతమని కొనియాడారు. ఉప రాష్టప్రతి పదవిని కూడా దేశం, సమాజాభివృద్ధికోసం ఉపయోగించుకోవటం వెంకయ్య నాయుడుకే చెల్లిందని మోదీ ప్రశంసలు కురిపించారు. రాజ్యసభ సజావుగా జరిగి దేశం, ప్రజల సమస్యలపై పెద్దఎత్తున చర్చ జరగాలన్న వెంకయ్య కోరిక తీరాలంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.