జాతీయ వార్తలు

విజయమాల్యానుంచి బాబుకు రూ.150కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశం విడిచి పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ మాల్యా నుండి రూ.150కోట్లు రాజకీయ విరాళంగా తీసుకున్నారని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. సోమవారం విజయ్ చౌక్ వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బ్యాంకులకు 9వేల కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టిన విజయమాల్యా 2016 మార్చి 1న రాజ్యసభలో ఉన్నారు.. మార్చి రెండున దేశం విడిచిపోయారు.. ఇది జరిగిన తరువాత పది రోజులకు లండన్ వెళ్లిన చంద్రబాబు 2016 మార్చి 12, 13, 14 తేదీల్లో విజయ మాల్యాను కలిశారని విజయసాయి రెడ్డి వెల్లడించారు. విజయ మాల్యాను కలిశారా లేదా అనే దానిపై చంద్రబాబు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 2009, 2014 ఎన్నికల్లో 150కోట్ల రూపాయలు రాజకీయ విరాళంగా విజయ మాల్యా నుండి తీసుకున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వని పక్షంలో ఇవన్నీ వాస్తవాలనే విషయాన్ని ధ్రువీకరించుకోవాల్సి వస్తుందని విజయసాయి స్పష్టం చేశారు.

బాబుపై సభా హక్కుల తీర్మానం
చంద్రబాబుపై సభా హక్కుల తీర్మానం నోటీసు ఇచ్చినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడుకు చంద్రబాబుపై సభా హక్కుల నోటీసును అందజేసినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు పార్లమెంటరీ సాంప్రదాయాలను మంటగలిపారని తీర్మానంలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.