జాతీయ వార్తలు

బలవంతపు మత మార్పిడులు దేశ భద్రతకు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: మావోయిజం, బలవంతపు మతమార్పిడుల వల్ల దేశ అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని బీజేపీ స్పష్టం చేసింది. పార్టీ సిద్ధాంతాలు, కీలక అంశాలపై దాని అభిప్రాయాలను కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులకు తెలియజేసేందుకు ఉద్దేశించిన ఓ మార్గదర్శక మాన్యువల్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దేశంలోని మావోయిస్టులకు పాకిస్తాన్, చైనా నుంచి నిరంతర మద్దతు అందుతోందని, దీనివల్ల అంతర్గత భద్రత మరింత సంక్షుభితంగా మారుతోందని ఆ మాన్యువల్‌లో తెలిపింది. కొంతకాలంగా నక్సలైట్ల చర్యలు, వారికి మద్దతు పలుకుతున్న వారి ధోరణి ఆందోళనకరంగా ఉందని తెలిపింది. ఇందుకు నిదర్శనంగా కొద్దిరోజుల కిందట మహారాష్ట్ర పోలీసులు పలువురు నక్సల్స్ సానుభూతిపరులు, మానవహక్కుల నాయకులను అరెస్టు చేసిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు, మానవ హక్కుల నాయకుల నుండి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా పోలీసుల చర్యలను బీజేపీ సమర్ధించింది. కొనే్నళ్ల నుంచి దేశంలో ఒకవైపు వివిధ క్రైస్తవ సంస్థలు మతమార్పిడులకు పాల్పడుతుండడం, మరోవైపు జిహాదీ, మసీహీ వంటి శక్తుల చర్యలు ఆందోళనకరంగా పరిణమించాయని, వీరివల్ల దేశ అంతర్గత వ్యవహారానికి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని బీజేపీ అభిప్రాయపడింది. దేశ అంతర్గత వ్యవహారాలకు విఘాతం కల్పిస్తున్న ఆయా శక్తులకు పాకిస్తాన్, చైనా వంటి దేశాల నుంచి భారీ ఎత్తున సహాయ సహకారాలు అందుతున్నాయని, దీనివల్లే వారు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆ మాన్యువల్‌లో పేర్కొంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆయా శక్తులు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నారని, కానీ కొన్ని రాష్ట్రాల్లో వాస్తవాలను గ్రహిస్తున్న ప్రజలు వారికి ఎదురు తిరుగుతున్నారని పేర్కొంది. నక్సల్స్, జిహాదీ, మతమార్పిడులకు పాల్పడుతున్న క్రైస్తవ సంస్థల వల్ల సమాజానికి తీరని ముప్పువాటిల్లుతోందని తెలిపింది.