జాతీయ వార్తలు

భార్యా బాధితుల బాధలూ వినండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి. వాటి ఆసరాగా భర్తలను వేధిస్తున్న మహిళల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ఇద్దరు బీజేపీ పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పురుష్ ఆయోగ్ పేరిట కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై మద్దతు కూడగట్టేందుకు వారు నడుంబిగించారు. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ ఈ విషయంపై ఆదివారం నాడిక్కడ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వారి సమస్యలపై డిమాండ్ చేసే హక్కువుందని, అయితే పురుషుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసే అగత్యం ఉందని తాను భావించడం లేదన్నారు. కాగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘోసికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ హరినారాయణ్ రాజ్‌బార్, అదే రాష్ట్రంలోని హర్‌డోయ్‌కి చెందిన మరో బీజేపీ ఎంపీ అన్సూల్ వర్మ మాట్లాడుతూ పురుష్ ఆయోగ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై ఈనెల 23న తాము ఓ బహిరంగ సభలోప్రసంగించనున్నామని, అందరి మద్దతూ కూడగడతామని అన్నారు.
ఇప్పటికే పార్లమెంటులో ఈ డిమాండ్ చేశామన్నారు. భర్తలు కూడా భార్యల చేతిలో బాధలు అనుభవిస్తున్నారని, దీనికి సంబంధించి అనేక కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మహిళల రక్షణకోసం ఉన్న చట్టాలు, ఫోరంలు దుర్వినియోగం అవుతున్నాయని, అలాగే పురుషుల బాధలు అరణ్యరోదనే అవుతున్నాయన్నారు. 1998 నుంచి 2015 వరకు సుమారు 27 లక్షల మంది మహిళా రక్షణ చట్టాల ముసుగులో అక్రమంగా అరెస్టు అయ్యారన్నారు. జాతీయ మహిళా కమిషన్ తరహాలోనే పురుషుల కోసమూ ఓ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగని ప్రతి మహిళా చెడ్డవారని తమ ఉద్దేశ్యం కాదన్నారు. శనివారం జరిగిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో తాను జాతీయ పురుష కమిషన్ ఏర్పాటుపై చర్చించానని ఆ కమిటీ సభ్యుడుకూడా అయిన అన్సూల్ వర్మ తెలిపారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 498ఎ దుర్వినియోగం కాకుండా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని పార్లమెంటు సైతం అభిప్రాయపడిందని ఆయన పేర్కొన్నారు.