జాతీయ వార్తలు

లాలూచీ పడేందు చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై వంద మంది సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ బీజేపీ చర్చనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఆరోపించారు. సోమవారం పార్లమెంట్ వాయిదా పడిన తరువాత ఆ పార్టీ ఎంపీలు విలేఖరులతో మాట్లాడారు. వరప్రసాద్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలకోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలతోపాటు అమరణ నిరహారదీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య చరిత్రలో తొలిసారి అని తెలిపారు. ఏదో ఒక సాకు చూపించి తీర్మానంపై చర్చ చేపట్టకుండా సభను స్పీకర్ వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై వందమందికిపైగా ఎంపీల మద్దతు కూడగట్టామని, కాని స్పీకర్ చర్చకు అనుమతించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వచ్చి సాధించేది ఏమీ లేదని, కేవలం తన రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు ఢిల్లీ జపం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ హక్కులకోసం చిత్తశుద్ధి లేని చంద్రబాబు, ఇప్పుడు కేవలం లాలూచీలకోసమే ఢిల్లీకి వస్తున్నారని ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అవిశ్వాస తీర్మాన నోటీసుపై లోక్‌సభ స్పీకర్ సభ్యులను లేక్కించేవరకు సభలో అలజడి చేయవద్దని అన్నా డీఎంకే ఎంపీలకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు సోమవారం పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద నిరసనను కొనసాగించారు.
ఆంధ్రాభవన్‌లో దీక్షకు అనుమతి ఇవ్వండి
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలును డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు చేపట్టట్టానున్న ఆమరణ నిరాహారదీక్షకు అనుమతి ఇవ్వాలని ఆ పార్టీ ఎంపీలు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీనాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్ నిరవధిక వాయిదా పడగానే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఆమరణ దీక్షకు దిగుతారని చెప్పారు. ఆంధ్రాభవన్ అధికారుల అనుమతి కోరామని, ప్రభుత్వం అనుమతించినా లేకున్నా ఏంపీలు దీక్ష చేస్తారని చెప్పారు.

సోమవారం పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద నినాదాలిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు
భారత్ బంద్‌తో రైళ్లకు అంతరాయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఎస్సీ/ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ వివిధ దళిత సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు వల్ల వంద ప్యాసింజర్, మెయిల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఆందోళనకారులు పట్టాలపై బైఠాయించడంతో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌తో సహా రెండు రైళ్లు మధ్యలోనే నిలిపివేసినట్టు అధికార్లు తెలిపారు. న్యూఢిల్లీ- అమృత్‌సర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను లూధియానా వద్ద, న్యూఢిల్లీ- అమృత్‌సర్ షాన్-ఎ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్‌ను అంబాలావద్ద నిలిపివేసారు. రాజస్థాన్, ఒడిశా, బిహార్, ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీల్లో ఆందోళనకారులు రైలు, రోడ్డు మార్గాలను దిగ్బంధించారు. హపూర్ స్టేషన్‌కు చేరిన రెండువేలమంది ఆందోళనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. తర్వాత ఆందోళనకారులను తొలగించి, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. తూర్పు మధ్య రైల్వేలో మొత్తం 43 రైళ్ల రాకపోకలకు ఆటంకం వాటిల్లింది. బిహార్‌లోని పాట్నా రైల్వేస్టేషన్‌లోకి చొరబడిన ఆందోళనకారులు, టికెట్ కౌంటర్‌లను బలవంతంగా మూసివేయించి, టికెట్లను ధ్వంసం చేశారు. దక్షిణ తూర్పు రైల్వే, ఈశాన్య సరిహద్దు రైల్వేల్లో 18 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.