జాతీయ వార్తలు

లోక్‌సభలో తమిళ ఎంపీల గలభా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంపై వైకాపా, తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం తదితర ఎనిమిది పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం సోమవారం తొమ్మిదో రోజు కూడా చర్చకు రాలేకపోయింది. లోక్‌సభ సోమవారం ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పటికే పోడియం వద్దకు వచ్చిన అన్నా డీఎంకే సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలిచ్చారు. దీంతో సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు.
లోక్‌సభ తిరిగి సమావేశం కాగానే అన్నా డీఎంకే సభ్యులు పోడియం వద్దకు దూసుకువచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిచ్చారు. ఈ నినాదాల గొడవ మధ్యనే స్పీకర్ ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేశారు. అనంతరం తెలుగుదేశం, వైకాపా, కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం, తదితర పార్టీల నాయకులు మోదీ మంత్రివర్గంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలను చర్చకు ప్రతిపాదించటం తన విద్యుక్త ధర్మమని సుమిత్రా మహాజన్ చెప్పారు. మీరిలా గొడవచేస్తే అవిశ్వాస తీర్మానాన్ని ఎలా ప్రతిపాదించగలుగుతానని ఆమె పదే పదే ప్రశ్నించారు. ఈ సమయంలో అనంతకుమార్ లేచి అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. సభ ఆర్డర్‌లోకి రాకపోతే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపటం సాధ్యం కాదని సుమిత్రా మహాజన్ పలుమార్లు స్పష్టం చేశారు. అన్నా డీఎంకే సభ్యులు మాత్రం స్పీకర్ ఆదేశాన్ని బేఖాతరు చేస్తూ నినాదాల జోరు పెంచారు. సభ ఆర్డర్‌లో లేనందున అవిశ్వాస తీర్మానాలను చర్చకు చేపట్టడం లేదని ప్రకటించి సభను మంగళవారం ఉదయం వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు. స్పీకర్ వెళ్లిపోయిన తరువాత కూడా ప్రతిపక్షం సభ్యులు సభలో కొద్దిసేపు ఉండిపోయారు. అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపట్టకపోవటం మంచిది కాదంటూ వారంతా స్పీకర్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశారు.