జాతీయ వార్తలు

టార్గెట్ టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ఓడించేందుకు భావసారూప్యత గల పార్టీలతో పొత్తులకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పచ్చజెండా ఊపారు. అలాగే టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు రాహుల్ గాంధీ తెలంగాణలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తారు. రాహుల్ పది జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. యుపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తారు. కాగా శాసన సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీని రాహుల్ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం, వామపక్షాలు, ఇతర భావసారూప్యత గల పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు కాంగ్రెస్ చీఫ్ అనుమతి ఇవ్వటంతోపాటు పార్టీ అభ్యర్థులు విజయం సాధించే నియోజకవర్గాల విషయంలో జాగ్రత్త పడాలని స్పష్టం చేశారు. సీనియర్లు తరచూ మీడియా ముందుకు వెళ్లి బాధ్యతారహితంగా మాట్లాడకూడదని ఆయన హెచ్చరించారు. రాహుల్ గాంధీ శుక్రవారం దాదాపు 3 గంటల పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కే. జానా రెడ్డి, సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ తదితర మొత్తం 40 మంది నాయకులతో విడివిడిగా, అందరితో కలిసి భేటీ అయ్యారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు అనుసరించవలసిన విధానంపై చర్చలు జరిపారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాతోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కుంతియా, ఉత్తమ్‌కుమార్ రెడ్డి మరి కొందరు భావసరూప్యత గల పార్టీలతో ఎన్నికల పొత్తు పెట్టుకోవలసిన అవసరం గురించి వివరించారు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు టీడీపీతో పొత్తు అవసరమని పలువురు నేతలు నొక్కిచెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనివార్యమని సీనియర్ నేతలు కొందరు రాహుల్‌తో అన్నట్టు తెలిసింది. పరిస్థితిని అధ్యయనం చేసిన రాహుల్ భావసారూప్యత గల పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు అంగీకరించారు.

టీడీపీతో పొత్తు ఉంటుంది: కుంతియా
తెలుగుదేశం, వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటామని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా వెల్లడించారు. కేసీఆర్ పాలనను సాగనంపేందుకు భావసారూప్యత గల పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాలను వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు. అలాగే రాహుల్ గాంధీ తెలంగాణలో పది బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని కుంతియా వెల్లడించారు. ఎస్సీ,ఎస్టీ, యువత తదితరులను దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామన్నారు. సోనియా గాంధీ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తారన్నారు. ఏమైనా సమస్యలుంటే పార్టీలో చర్చించుకోవాలే తప్ప మీడియాకు ఎక్కవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంత పెద్ద నాయడికిపైనైనా చర్యలుంటాయన్నారు. కాంగ్రెస్ ప్రతికూల వార్తలను మీడియాకు అందజేసే వారిపై అత్యంత కఠిన చర్యలు ఉంటాయన్నారు.

మాదే అధికారం:ఉత్తమ్
శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రాబోతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ దాదాపు 40 మందితో చర్చించారని ఆయన అన్నారు. భావసారూప్యత గల పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు రాహుల్ గాంధీ ఆమోదం తెలపటంతోపాటు పార్టీ విజయం సాధించే సీట్లను వదులుకోవద్దని స్పష్టం చేశారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని ఆంధ్రా, రాయలసీమ వారికి సముచిత ప్రాధాన్యత లభిస్తుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

భక్తచరణ్‌దాస్ అధ్యతన
స్క్రీనింగ్ కమిటీ
కాగా తెలంగాణ శాసన సభకు జరిగే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సీనియర్ నాయకుడు భక్తచరణ్‌దాస్ అధ్యక్షతన ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. జ్యోతిమణి సెన్నిమలై, శర్మిష్టా ముఖర్జీ ఈ కమిటీ సభ్యులు. వీరు అతి త్వరలోనే హైదరాబాదుకు వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులతో చర్చలు జరిపిన అనంతరం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.