జాతీయ వార్తలు

తప్పంతా కేంద్రానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని బలహీనపరుస్తూ సుప్రీం ఇచ్చిన ఉత్తర్వుపై దళిత సంఘాలు తలపెట్టిన ఆందోళనలను కేంద్రం సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే భారీ ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవించిందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిగిన పరిణామాలకు కేంద్రం బాధ్యత వహించక తప్పదని కాంగ్రెస్ హెచ్చరించింది. సమాజంలో దళితులు, బలహీనవర్గాల సంక్షేమం పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టింది. ఎన్డీయే పాలనలో దళితులు, మైనారిటీలకు రక్షణలేకుండా పోయిందని విచారం వ్యక్తం చేసింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ దేశంలో దళితులు, మైనారిటీలపై అత్యాచారాలు, దాడుల సంఖ్య పెరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాంనబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టం పరిరక్షణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకునివుంటే, ఈరోజు భారత్ బంద్ జరిగి ఉండేది కాదని రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఉత్తర్వుపై పునఃస్సమీక్ష కోరుతూ సుప్రీం కోర్టులో పిటీషన్ వేయాలన్న కాంగ్రెస్, ఇతర పక్షాల సూచనలను కేంద్రం పెడచెవిన పెట్టకపోయివుంటే దేశంలో ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తేది కాదని స్పష్టం చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నేత మల్లిఖార్జున ఖర్జే మాట్లాడుతూ ‘సుప్రీం ఉత్తర్వు దేశ జనాభాలో 23శాతం మందిపై ప్రభావం చూపుతుందని, అయినా ప్రభుత్వం ఆ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సుప్రీం ఉత్తర్వుపై చట్ట సవరణ చేయాలి లేదా ఫుల్‌బెంచ్‌కు సమీక్ష పిటీషన్ దాఖలు చేయాలని’ డిమాండ్ చేశారు.

మీ పోరుకు నా శాల్యూట్: రాహుల్
‘దేశంలోని దళితులపై ఎందుకంత చిన్నచూపు?’ అంటూ ఆరెస్సెస్, బీజేపీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు నుంచి తమ హక్కుల పరిరక్షణకు రోడ్డెక్కిన దళిత సోదర సోదరీమణులకు శాల్యూట్ చేశారు. దేశవ్యాప్త ఆందోళనలు విజయవంతం కావటంపై రాహుల్ పైవ్యాఖ్యలు చేశారు. ‘దళితులను చిన్నచూపు చూడటం అనేది ఆరెస్సెస్, బీజేపీ రక్తంలోనే ఉంది. ఆ విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అణగదొక్కడం వారికి హింసతో పెట్టిన విద్య. తమ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వ హింసను సైతం లెక్కచేయకుండా రోడ్డెక్కిన దళిత సోదరులు, సోదరీమణులకు శాల్యూట్ చేస్తున్నాం’ అంటూ రాహుల్ గాంధీ తన ట్విటర్‌లో ఖాతాలో పోస్ట్ చేశారు.
రెండు వారాల్లోనే రివ్యూ పిటిషన్ వేశాం: పాశ్వాన్
దళిత సంక్షేమం విషయంలో బీజేపీని విమర్శించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అన్నారు. దళిత సంక్షేమం విషయంలో కాంగ్రెస్ పార్టీవి కాకమ్మ కబుర్లేనని ఎద్దేవా చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు సంచలన ఉత్తర్వు వెలువరించిన నాటినుంచీ రాజకీయ పక్షాలన్నీ బీజేపీని టార్గెట్ చేయడాన్ని పాశ్వాన్ తీవ్రంగా ఖండించారు. సుప్రీం తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడాన్ని గుర్తుచేస్తూ, దళితుల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కనుకే రెండు వారాల్లో రివ్యూ పిటిషన్ దాఖాలు చేసినట్టు రామ్‌విలాస్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు.