జాతీయ వార్తలు

సర్జికల్స్ స్ట్రైక్స్ డే ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో ఉగ్రవాదం పీచమణిచేందుకు కేంద్రం 206సెప్టెంబర్ 29న చేపట్టిన సర్జికల్ స్రైక్స్ ఉదంతం వివాదమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన సర్జికల్ స్ట్రైక్స్ డే పాటించాలని యూజీసీ విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపై సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం 2016 నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు చేసిందని, ఆ రోజును సర్జికల్ స్ట్రైక్ డేగా పాటించే ధైర్యం యూజీసీకి ఉందా అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 29వ తేదీన సర్జికల్ స్ట్రైక్స్ డేగా పాటించాలంటూ దేశంలోని వర్శిటీల వీసీలకు యూజీసీ ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు తోడ్పడే విధంగా యూజీసీ వ్యవహరించరాదన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పేదలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారని, ఆ రోజును సర్జికల్ స్ట్రైక్స్ డేగా ఎందుకు పాటించరాదని ఆయన నిలదీశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రితో మన విదేశాంగ శాఖ మంత్రి సమావేశం కావడం, ఈ వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. కాగా కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ మాట్లాడుతూ, దేశ భక్తి పెంపొందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలను విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ అంశాలను రాజకీయం చేయడం తగదన్నారు.