జాతీయ వార్తలు

పళనిపై పన్నీర్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 5: తమిళనాడు ముఖ్యమంత్రి ఓ. పళనిస్వామిని పదవి నుంచి తప్పించేందుకు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారని అమ్మా మక్కల్ మునే్నట్ర కలంగం (ఏఎంఎంకే) అధినేత టీవీవీ దినకరన్ తెలిపారు. ఈ విషయమై గత సెప్టెంబర్‌లో తనతో సంప్రదించేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నించారని ఈ బహిష్కృత ఏఐఏడీఎంకే నేత ఆరోపించారు. ఈ విషయంపై గత ఏడాది జూలైలో పన్నీర్ సెల్వం తనను కలిశారని, అలాగే మళ్లీ తాజాగా గడచిన సెప్టెంబర్ మాసంలో కలిసేందుకు ప్రయత్నించారని, ఈ విషయంలో తనతో స్నేహితుని (కామన్‌ఫ్రెండ్)గా మెలగాలని సందేశాలను పంపారని ఆయన చెప్పారు. ‘పళనిస్వామిని పదవి నుంచి తప్పించి నిన్ను అంతేస్థాయి అత్యున్నత పదవిలో నియమిస్తాన’ని పన్నీర్ సెల్వం ఆశ చూపారని, ఐతే తాను అందుకు అంగీకరించలేదని ఏఎంఎంకే లీడర్ శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. అంతకు ఒక రోజుముందే దినకరన్ అనుచరుడు తంగ తమిళ్ సెల్వన్ ఒక టెలివిజన్ చర్చా వేదికలో ఇదే విషయం చెప్పడం గమనార్హం. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్నది పన్నీర్‌సెల్వం ఏకైక లక్ష్యమని, అందుకోసం ఏమిచేయడానికైనా సిద్ధపడుతున్నారని దినకరన్ అంటున్నారు. ప్రజాజీవితంలో తనకు పన్నీర్‌సెల్వం ప్రత్యర్థికావడం, తన ఎదుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించడం వల్లే తాను ఈ విషయాలను వెల్లడిస్తున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే దినకరన్ ఆరోపణలను అధికార ఏఐడీఎంకే వర్గాలు తోసిపుచ్చాయి. నీటి నుంచి బయటికొచ్చిన చేపలాంటి పరిస్థితుల్లో ఉన్న దినకరన్ అనవసర రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఏఐడీఎంకే అధికార ప్రతినిధి ఆర్‌ఎం బాబు మురుగవేల్ పేర్కొన్నారు. ఆయనకు మద్దతునిచ్చిన 18 మంది ఏఐడీఎంకే శాసన సభ్యులపై అనర్హత వేటుపై మద్రాసు హైకోర్టు నిర్ణయం తాలూకు టెన్షన్ నుంచి కోలుకునేందుకే ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నట్లు ఉందని ఆయన చెప్పారు. ఇలావుండగా అర్హత కోల్పోయిన కొంతమంది ఎమ్మెల్యేలు దినకరన్ తీరుపట్ల ప్రస్తుతం వ్యతిరేకతో వున్నారని పళనిస్వామి వర్గంలోకి ఫిరాయించేందుకు వారు సిద్ధపడుతున్నారని తెలిసింది. ఈ కేసులో అధికార పార్టీ ప్రజల్లో పైచేయి సాధించిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి పళని స్వామిపై గత ఏడాది అవిశ్వాసం ప్రకటించిన 18 మంది ఏఐడీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్ పి. ధన్‌పాల్ అనర్హత వేటువేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.