జాతీయ వార్తలు

నక్సల్ సతో కాంగ్రెస్ కుమ్మక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్హర్‌పూర్ (చత్తీస్‌గఢ్), అక్టోబర్ 5: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 2003వ సంవత్సరం కన్నా ముందు చత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నక్సలైట్లతో కుమ్మక్కయిందని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మావోయిస్టు జాఢ్యాన్ని నియంత్రించడంలో విజయవంతమయిందని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టుల ప్రాబల్యం గల కంకేర్ జిల్లా నర్హర్‌పూర్‌లో జరిగిన గిరిజన సదస్సులో అమిత్ షా మాట్లాడుతూ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు రావాలని ఆయన ప్రతిపక్ష పార్టీకి సవాలు విసిరారు.
చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తన ప్రభుత్వం 15 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడానికి చేపట్టిన అటల్ వికాస్ యాత్ర క్యాంపెయిన్ ముగింపును పురస్కరించుకొని ఈ సదస్సు నిర్వహించారు. ‘చత్తీస్‌గఢ్ ఒకప్పుడు బుల్లెట్ల చప్పుళ్లతో దద్దరిల్లుతుండేది.. 2003లో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో నక్సలైట్లతో సంబంధాలు పెట్టుకుందని చెప్పడానికి నేను సంకోచించను. వారి బంధాన్ని మేము బద్దలుగొట్టాం. నక్సలైట్లను అణచివేశాం. మొత్తం చత్తీస్‌గఢ్ క్రమంగా నక్సలిజాన్ని వదిలించుకుంటూ, అభివృద్ధి పథం వైపు దూసుకుపోతోంది’ అని అమిత్ షా అన్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు దీనిని ‘బీమారు’ (వెనుకబడిన) రాష్ట్రంగా పిలిచేవారు. కొత్త రాష్ట్రంలో తొలి మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆర్థికాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ శాంతి భద్రతలను పరిరక్షించడానికి, నక్సలైట్లను అణచివేయడానికి, దారిద్య్ర నిర్మూలనకు, ఆదివాసీల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని ఆయన విమర్శించారు. ‘అటల్ జీ (అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి) రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగా, రమణ్ సింగ్ దీన్ని అభివృద్ధి చేశారు’ అని అమిత్ షా అన్నారు.
గత 15 ఏళ్లలో రమణ్ సింగ్ ప్రభుత్వం రాష్ట్రంలో 24 గంట ల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తోందని, మారుమూల గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసిందని, కనీస మద్దతు ధరకు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోందని, ఇతర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.