జాతీయ వార్తలు

అశాంతి పాక్ అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: కాశ్మీర్‌లో అశాంతిని కలిగించడం తప్ప మరో అజెండా పాకిస్తాన్‌కు లేదని, పాక్ దుర్నీతిని అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ధ్వజమెత్తారు. కాశ్మీర్‌లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో 90 శాతం ప్రజలు పాల్గొనేందుకు ఉవీళ్లూరుతున్నారని ఆయన అన్నారు. పాకిస్తాన్‌లో నక్కిన ముంబయికి చెందిన డాన్ దావూద్ ఇబ్రహీంను తీసుకురావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యంకాకపోవచ్చన్నారు. 1993 ముంబయి పేలుళ్లలో దావూద్ ప్రధాన నిందితుడన్నారు. 1995 నుంచి ఇంత వరకు కాశ్మీర్‌లో ఆరు వేల వరకు ఉగ్రవాద హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. ఈ ఏడాది వీటి సంఖ్య తగ్గిందని, 360 ఘటనలు నమోదైనట్లు చెప్పారు. హిందూస్తాన్ టైమ్స్ నాయకత్వం అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, కాశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు ఉత్సాహపడుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న సమాచారంపై అడగ్గా, పశ్చిమబెంగాల్‌లో కూడా 43 శాతం చోట్ల బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. ఇవన్నీ సాధారణమైన అంశాలేనన్నారు. పీడీపీ, బీజేపీ పార్టీలు సంయుక్తంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని, కాని ఈ ప్రయోగం విఫలమైందన్నారు. దేశంలో నక్సలిజం 126జిల్లాల నుంచి 50-52 జిల్లాలకు పడిపోయిందన్నారు. మొత్తం 12 జిల్లాల్లో నక్సల్స్ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్నాయన్నారు. దేశంలో నక్సలిజాన్ని పెంచిపోషించే శక్తుల పట్ల చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తున్నదన్న ఆరోపణ సరైందికాదన్నారు. ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఈ దేశంలో బీజేపీ పాలనలో ఏ వ్యవస్థ బలహీనపడిందో ఒక్క ఉదాహరణ చెప్పాలన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమని, మూక హింసలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాలను ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. రైతాంగ ఉద్యమాలపై మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనపై ప్రభుత్వం కొన్ని హామీలను ఇచ్చిందని, వీటిని నెరవేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రైతు సంఘాల ప్రతినిధులతో తమ ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు.