జాతీయ వార్తలు

తేలని తెలంగాణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వచ్చే వారాంతంలో 4 రాష్ట్రాల నోటిఫికేషన్ * ఎన్నికల సంసిద్ధతపై ఈసీ సమీక్ష
న్యూఢిల్లీ, అక్టోబర్ 5: రాబోయే ఎన్నికల అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం సమీక్షించింది. ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ వివిధ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో సమావేశమై ఐదు రాష్ట్రాల శాసన సభలు, లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు గల సంసిద్ధత, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ల వెబ్‌సైట్ల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షా సమావేశం జరిపారు. తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్‌తోపాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మిజోరం, మహారాష్ట్ర తదితర పనె్నండు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు నేటి సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. రావత్ గురువారం కూడా పలు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్ల గురించి చర్చించారు. రావత్ తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితా వ్యవహారం, దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ ప్రారంభం కావడం తదితర అంశాల గురించి రజత్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఆయన వచ్చే వారం, అంటే పదో తేదీ నాడు తెలంగాణకు వెళ్లవలసి ఉంది. అయితే, వచ్చే వారం విదేశీ పర్యటనకు వెళ్లాల్సిరావడంతో ఇప్పుడు ఆయన స్థానంలో ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు తెలంగాణకు వచ్చి రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను తుది దఫాగా పరిశీలించనున్నారు. వీరి నివేదిక ఆధారంగా తెలంగాణ ఎన్నికల షెడ్యూలును నిర్ణయించే అవకాశాలున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఈసీ వచ్చే వారాంతంలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలును విడుదల చేసేందుకు అవకాశాలున్నాయని సమాచారం. ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలుతో పాటు తెలంగాణ శాసన సభ ఎన్నికల షెడ్యూలు ఉంటుందా? లేదా? అనేది స్పష్టం కావటం లేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి సుప్రీం కోర్టు ఆదేశం మేరకు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఓటర్ల జాబితా వివాదంపై పిటిషన్ దాఖలు చేయటం, హైకోర్టు దీనిని విచారణకు చేపట్టి తమ విచారణ పూర్తి అయ్యేంత వరకు తుది ఓటర్ల జాబితాను ప్రకటించవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల ఎనిమిదో తేదీ జరుగనున్నది. హైకోర్టు ఎనిమిదో తేదీనాడు వ్యక్తం చేసే అభిప్రాయాలు లేదా జారీ చేసే ఆదేశాలను పరిశీలించిన తరువాతనే తెలంగాణ శాసన సభ ఎన్నికల నిర్వహణ అంశంపై ఒక నిర్ణయానికి రావాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రావత్ తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాతే తెలంగాణ శాసన సభ ఎన్నికల షెడ్యూలుపై దృష్టి సారిస్తారనే మాట వినిపిస్తోంది. ఇదిలావుంటే తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ శనివారం మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపే అవకాశాలున్నాయి. ఆయన శుక్రవారం ఈసీ సమావేశానికి హాజరైన అనంతరం మీడియాను కలుసుకోకుండా వెళ్లిపోయారు. ఆయన కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వెనకవైపు గేటు నుండి వెళ్లిపోవటం గమనార్హం.