జాతీయ వార్తలు

అసెంబ్లీ రద్దు పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు స్వేచ్ఛనిచ్చింది. తెలంగాణ శాసనసభకు ఐదు సంవత్సరాలు పూర్తి అవకుండానే అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అసెంబ్లీ రద్దు చేస్తూ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని హైదరాబాద్‌కు చెందిన కొమిరెడ్డి రాంచందర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. దీనిపై పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తెలంగాణ శాసనసభను రద్దు చేయడం వల్ల ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తుందని, ఈ పిటిషన్ స్వీకరించి విచారణ జరిపించాలని కోరారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలు, ఓటరు జాబితా సవరణ ప్రచురణ వంటి పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయని, వాటన్నింటినీ ఉమ్మడి హైకోర్టుకు బదలాయించామని ధర్మాసనం పిటిషనర్ తరపు న్యాయవాదికి వివరించింది. అదే అంశంతో కూడిన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టును ఆశ్రయించడం సరైనది కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీం కోర్టుకు రావడం సరైనది కాదని పేర్కొంది. దీనిపై హైకోర్టు వెళ్లాలా వద్దా అనే స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందని వ్యాఖ్యానించింది.