జాతీయ వార్తలు

యువత మధ్య అన్యోన్యత అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఇరు దేశాలకు చెందిన యువత మధ్య ముఖ్యంగా పాఠశాల స్థాయి విద్యార్థుల మధ్య అన్యోన్యత ఎంతో ప్రధానమయిన పాత్ర పోషిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని అసాధారణ స్థాయికి తీసుకెళ్లడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సహకారం సుదీర్ఘ కాలం పాటు కొనసాగడానికి ఇది పునాదిగా నిలుస్తుందని ఆయన అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఇక్కడ భారత్‌లోని అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎం), రష్యాలోని సిరియస్ ఎడ్యుకేషన్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన కొంతమంది విద్యార్థులతో సమావేశమయ్యారు. ఇరు దేశాల యువత పేదల జీవన విధానాన్ని మెరుగుపరచడానికి సృజనాత్మకంగా పనిచేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏఐఎం, సిరియస్ మధ్య ఒక అవగాహనా ఒప్పందం కూడా కుదిరింది. ఇరు దేశాలకు చెందిన విద్యార్థులతో సమావేశం కావడం పట్ల కూడా ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇరు దేశాలకు చెందిన విద్యార్థులు పరస్పరం కలుసుకునే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కొనసాగాలని ఆయన సూచించారు. ‘దీన్ని (రష్యా విద్యార్థులు భారత్‌ను సందర్శించే కార్యక్రమాన్ని) ముందుకు తీసుకెళ్లాలి. భారత విద్యార్థులు రష్యా విద్యాసంస్థలను సందర్శించాలి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి. ప్రజలు ముఖ్యంగా పేద ప్రజల జీవనవిధానాలను మెరుగుపరచడానికి తాము ఏమి చేయగలమనే అంశాన్ని భారత్, రష్యా విద్యార్థులు కలిసి ఆలోచించాలి’ అని మోదీ అన్నారు.