జాతీయ వార్తలు

సంస్కృతే మనకు కొండంత రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, అక్టోబర్ 5: భారత ప్రజల్లో పాతుకుపోయి ఉన్న జాతీయభావం, సాంస్కృతిక అంశాల వల్ల ఆల్‌ఖైదా, ఐసిఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలను మనం విజయవంతంగా తరిమికొట్టి వారికి స్థానం లేకుండా చేయగలిగామని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రభుత్వ అధికారులతో శుక్రవారం జరిగిన సమన్వయ సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తమ కార్యకలాపాలను యధేచ్ఛగా నిర్వహించుకోవడానికి ఈ ఉగ్రవాద సంస్థలకు భారత్ ప్రజలు అంగీకరించలేదని ఆయన చెప్పారు. మనకు ఒక ప్రత్యేక సంస్కృతి ఉందని, ఆ సంస్కృతి ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా లాంటి దేశాల్లో సైతం ఐసిఐఎస్ లాంటి సంస్థలు వేళ్లూనుకుపోయి ఉన్నాయని, కాని వారి పప్పులు భారత్‌లో ఉడకలేదన్నారు. భయంకరమైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఇరాక్, సిరియాలలో 2014లో కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుని తమ ఆధీనంలోకి తీసుకున్నాయన్నారు. అప్పటి నుంచి ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పలు దాడులకు పూనుకుంటోందని అన్నారు. ఇటీవల యూపీలో హిజబుల్ ముజాహిద్దీన్‌కు చెందిన పేరుమోసిన టెర్రరిస్టును అరెస్టు చేసిన నేపథ్యంలో అసోంలో ఆ సంస్థ కార్యకలాపాలు ఊపందుకున్నాయా అన్న ప్రశ్నకు ఇప్పుడు ఆ గ్రూపుకు చెందిన చాలామంది కేసుల్లో ఉన్నారని, వారి ప్రభావం ఏమీ లేదని మంత్రి స్పష్టం చేశారు. జీహాదీ మద్దతుదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలలో ఆరు మైనారిటీ వర్గాలకు లబ్ధి చేకూర్చడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న ఆరోపణను ఆయన ప్రస్తావిస్తూ అదంతా అవాస్తవమని, వారికి తగిన విధంగా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. అసలు మైనారిటీ ఎవరు, మెజారిటీ ఎవరు అని మంత్రి ప్రశ్నించారు. కొన్నిచోట్ల మైనారిటీలుగా ఉన్న సిక్కులు పంజాబ్‌లో మెజారిటీ అని, అలాగే పలు రాష్ట్రాలలో మైనారిటీలుగా ఉన్న క్రైస్తవులు నాగాలాండ్‌లో మెజారిటీ అని ఆయన చెప్పారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సాధికారిత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లోని మైనారిటీలలో చాలాతక్కువ శాతం అక్షరాస్యత ఉందని, ఈ నేపథ్యంలో వారికి స్కూళ్ల సంఖ్యను పెంచడానికి, స్కాలర్‌షిప్‌లు ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నఖ్వీ తెలిపారు.