జాతీయ వార్తలు

పోలవరంపై అధ్యయనం అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఏగువన ఏర్పాడే నిల్వ జలాలపై మరోసారి అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టుకు కేంద్ర స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలని ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో పాటు, ఇటీవల దాఖలు చేసిన పిటిషన్, రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ మదన్ బీ. లోకుర్, జస్టిస్ అబ్దుల్ నాజీర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ముందుగా కేంద్రం తరపున సొలిసిటరల్ జనరల్ పింకీ ఆనంద్ వాదనలు వినిపిస్తూ పోలవరం ప్రాజెక్టు మూలంగా ఏర్పాడే నిల్వజలాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన గోపాల కృష్ణ కమిటీ 2011లోనే అధ్యయనం చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల మళ్లీ ప్రస్తుతం అధ్యయనం అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ, ఒడిశా నిలువ జలాలపై లేవనేత్తిన అభ్యంతరాలపై అధ్యయనం విచారణ అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలంటూ దాఖలైన పిటిషన్, ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్‌పై స్టేను ఎత్తివేయాలన్న మధ్యంతర పిటిషన్ల్‌ను ధర్మాసనం విచారణ కోనసాగించనుంది. దీనిపై తదుపరి విచారణను నవంబరు 15న కోనసాగిస్తామని ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

కృష్ణా ట్రిబ్యునల్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా నది జలాలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంపకాలు చేసేందుకు ఉద్దేశించిన జస్టిస్ బ్రీజేస్ కుమార్ ట్రిబ్యునల్‌లో విచారణ నవంబరు 27, 28, 29 తేదీలకు వాయిదా పడింది. శుక్రవారం ఏపీ తరపున సాక్షిగా ఉన్న హైడ్రాలజీ రంగ నిపుణుడు విశే్వశ్వరరావును తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది రవీందర్‌రావుక్రాస్ ఏగ్జామినేషన్ చేశారు. ట్రిబ్యునల్ ముందు న్యాయవాది రవీందర్‌రావు అడిగిన ప్రశ్నలకు విశే్వశ్వరరావు సమాధానాలు ఇచ్చారు. ట్రిబ్యునల్ తదుపరి విచారణ నవంబరు 27కి వాయిదా పడింది.

ఏడాదిలోగా ఆర్డినెన్స్ తెండి
* రామమందిరంపై కేంద్రానికి వీహెచ్‌పీ డెడ్‌లైన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 5: అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఆఖరి పోరాటానికి విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖరులోగా రామమందిరం నిర్మాణంపై పార్లమెంటులో ఆర్డినెన్స్ తీసుకురావాలని గడువు (డెడ్‌లైన్) విధించింది. మహంత్ నృత్య గోపాల్ దాస్ అధ్యక్షతన వీహెచ్‌పీ శుక్రవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించింది. ఇందులో రామజన్మభూమి న్యాస్ నిర్వహణా అధినేత అయిన గోపాల్ దాస్ సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సమావేశం అనంతరం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకుని విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు.