జాతీయ వార్తలు

రష్యాతో దోస్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అమెరికా బెదిరింపులను భారత్ ఏమాత్రం పట్టించుకోలేదు. రష్యాతో ఏకంగా ఎనిమిది ఒప్పందాలను కుదుర్చుకొని, ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎస్-400 ఆకాశ క్షిపణులు, గగన్‌యాన్ తదితర మొత్తం ఎనిమిది ఒప్పందాలు చేసుకుని చరిత్ర సృష్టించారు. పుతిన్, మోదీ సమక్షంలో ఇరు దేశాలకు చెందిన సీనియర్ అధికారులు శుక్రవారం హైదరాబాద్ హౌస్‌లో ఎనిమిది ఓప్పందాల పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు. రష్యాతో క్షీపణుల కొనుగోలు ఒప్పందం చేసుకుంటే కఠినమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో హెచ్చరించడం తెలిసిందే. అయితే, మోదీ ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా రష్యాతో ఎనిమిది ఒప్పందాలు చేసుకున్నారు. శిఖరాగ్ర సమావేశంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు భారత వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లేందుకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహాయాన్ని రష్యా అందజేస్తుంది. 2020 నాటికి భారత వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిస్తామని మోదీ ఇది వరకే ప్రకటించారు. రక్షణ ఒప్పందం మేరకు రష్యా మన దేశానికి ఎస్-400 అని పిలిచే ట్రయింఫ్ క్షిపణి వ్యవస్థను అందజేస్తంది. భూతలం నుండి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే ఈ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమైనది. 2014లో చైనా దీనిని రష్యా నుండి కొనుగోలు చేయగానే అమెరికా ఆ దేశంపై ఆంక్షలు విధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. అయితే ఇప్పుడు అమెరికా మన దేశంపై ఆంక్షలు విధించకపోవచ్చునని అంటున్నారు. భారత దేశంపై ఆంక్షలు విధిస్తే వ్యాపారం ద్బెతింటుందని ఆమెరికా ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఈ ధీమాతోనే ఎస్-400 ట్రయింఫ్ క్షిపణి వ్యవస్థను భారత దేశానికి అందజేసే ఓప్పందంపై పుతిన్, మోదీ సంతకాలు చేశారు. ఐదు బిలియన్ అమెరికన్ డాలర్ల విలువ చేసే ఎస్-400 క్షిపణి వ్యవస్థను దిగుమతి చేసుకోవడం వలన భారత సైనిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. మరో ఒప్పందం మేరకు రష్యా నుండి నాలుగు క్రివాక్ తరగతి ఫ్రిగేట్లను భారత్ కొనుగోలు చేస్తుంది. ఈ నాలుగు ఫ్రిగేట్లలో నుండి రెండింటిని రష్యా నుండి దిగుమతి చేసుకుంటే మిగతా రెండింటిని భారత దేశంలోని గోవా షిప్‌యార్డ్‌లో తయారు చేస్తారు. దీనితోపాటు ఈ ఫ్రిగేట్లకు సంబంధించిన సాంకేతిక పరిజానాన్ని భారత దేశానికి రష్యా అందజేస్తుంది.
గగన్‌యాన్ పేరుతో భారత వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపించేందుకు సంబంధించిన ఒప్పందం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కోమోస్ మధ్య కుదిరింది. ఈ ఒప్పందం కింద రోస్‌కోమోస్ భారత వ్యోమగామికి అంతరిక్ష సంబంధమైన శిక్షణ ఇవ్వటంతోపాటు ఇందుకు సంబంధించిన ఇతర సాంకేతిక పరిజానాన్ని అందచేస్తుంది. గతంలో రష్యా మన వ్యోమగామి రాకేశ్ శర్మను తమ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించటం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇస్రో సొంత రాకెట్ ద్వారా తమ వ్యోమగామిని భారత భూభాగం నుండి అంతరిక్షంలోకి పంపించేందుకు రష్యా అంతరిక్ష సంస్థ సహాయ, సహకారాలు అందజేస్తుంది. ఎస్-400 క్షిపణులు, గగన్‌యాన్‌తోపాటు అణు విద్యుత్, రైల్వే రంగానికి సంబంధించిన అంశాలపై కూడా ఒప్పందాలు జరిగాయి. రెండు దేశాల మధ్య కుదిరిన రైల్వే ఒప్పందం ప్రకారం నాగపూర్-సికింద్రాబాద్ అధునీకీకరణం, అప్ గ్రెడేషన్ పనిని వేగవంతంగా పూర్తి చేస్తారు. రెండు దేశాల మద్య ఎరువుల అభివృద్ధికి సంబంధించిన ఒక ఒప్పందం కూడా కుదిరింది.