జాతీయ వార్తలు

పర్యావరణ పరిరక్షణకు వినూత్న పద్ధతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రమాదకర వాతావరణ మార్పులపై అప్రమత్తం అయ్యేందుకు ఏ రకమైన నివేదికలపైనా ఆధారాపడాల్సిన అవసరం లేకుండా మనదేశం పర్యావరణ పరిరక్షణకు వినూత్న పద్ధతులను అనుసరింస్తున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ మంగళవారం నాడిక్కడ తెలిపారు. భూ గోళంపై రెండు డిగ్రీల సెల్సియస్ వేడిపెరిగితే భారత దేశం తీవ్రమైన వేడిగాలులను చవిచూడాల్సి వస్తుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఫార్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) నివేదిక హెచ్చరించిన నేపథ్యంలో మంత్రి హర్షవర్థన్ పైవిధంగా స్పందించారు. ఇలాంటి నివేదిక కోసం వేచిచూడాల్సిన అవసరం మనకు లేదు. మన దేశంలో పర్యావరణాన్ని నియంత్రించేందుకు, వాతవరణ మార్పులపై పోరాడేందుకు అవసరమైన అన్ని చర్యలనూ ఇప్పటికే చేపట్టడం జరిగిందన్నారు. ‘మనదేశ అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ’ అనే అంశంపై పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ శాఖ, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమంలో మంగళవారం నాడాయన ప్రసంగించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు భారతదేశం ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని మంత్రి అన్నారు. ప్రపంచ బ్యాంకుకు చెందిన భారతదేశ డైరెక్టర్ జునైద్ అహ్మద్ మాట్లాడుతూ వాతావరణ మార్పులపై సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత దేశ చర్యలను విశ్వసిస్తున్నాయని అన్నారు.